కేడ‌ర్‌ను కాపాడుకోలేని ప‌వ‌న్ మాట‌లు పిచ్చి కామెడీయే...!

VUYYURU SUBHASH
ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన జ‌న‌సేన పార్టీకి 8 ఏళ్లు పూర్త‌య్యాయి. 9వ వ‌సంతంలోకి పార్టీ ప్ర‌వేశించింది. అయితే.. ఈ సంద‌ర్భంగా పార్టీ అదినేత ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై పార్టీలోనే పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోం ది. అదేంటంటే.. ప‌వ‌న్ పై పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు.. ప‌ద‌వులు ఆశిస్తున్న‌వారు... చాలానే ఆశ‌లు పెట్టు కున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీ పుంజుకుంటుంద‌ని... అధికారంలోకి వ‌చ్చే స్థాయికి చేరుతుంద‌ని. అనుకున్నారు. దీనికి సంబంధించి త‌మ‌కు దిశానిర్దేశం చేస్తార‌ని.. తాజాగా జ‌రిగిన 9వ ఆవిర్భావ స‌భ‌పై ఆశ‌లు పెట్టుకున్నారు.
కానీ, అనూహ్యంగా ప‌వ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ధ్యేయ‌మ‌ని ప్ర‌క‌టించినా.. ఎలా ముందుకు వెళ్తాం అనేది మాత్రం చెప్ప‌లేక పోయారు. పార్టీ నేత‌ల‌ను ఏకం చేయ‌డంతోపాటు.. మేధావి వ‌ర్గాన్ని.. ఎస్సీ, ఎస్టీ బీసీ సామాజిక వ‌ర్గాల‌ను ఎలా క‌లుపుకొని ముందుకు సాగుతాం.. అనే అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించ‌లేక పోయారు జ‌న‌ర‌ల్గా ఉన్న స‌మ‌స్య‌ల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించారు త‌ప్ప‌.. పార్టీకి బ‌ల‌మైన పునాదులు వేసే వ్యూహాల‌ను ఆవిష్క‌రించ‌లేక పోయార‌ని.. పార్టీలోని చాలా మంది కీల‌క నాయ‌కులు అబిప్రాయ ప‌డుతు న్నారు. పైగా..ఇత‌ర పార్టీల‌తో పొత్తులు పెట్టుకునే దిశ‌గానే ఆయ‌న మాట్లాడిన తీరుకు పెద‌వి విరుస్తున్నారు..
``మా నాయ‌కుడు పార్టీ ప్రారంభించి 8 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వ్యూహం లేదు. టీడీపీని, ఇత‌ర నేత‌ల‌ను గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిట్టాం. టీడీపీ నాయ‌కులు.. అవినీతి ప‌రుల‌ని అన్నాం. మ‌ళ్లీ ఇప్పుడు ఆ పార్టీతోనే చేతులు క‌లిపేలా.. అడుగులు వేస్తున్నాం.. ఇదేం వ్యూహమోమాకు అర్ధంకావడం లేదు. కుటుంబ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకం అంటున్నారు. కానీ, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలా అయితే.. మా వ్యూహాలు ఎలా స‌క్సెస్ అవుతాయి?`` అని విజ‌య‌వాడ‌కు చెందిన కీల‌క‌జ‌న‌సేన నాయ‌కుడు ఒక‌రు ఆఫ్ దిరికార్డుగా మీడియా మిత్రుల‌తో వ్యాఖ్యానించారు.
ఈయ‌న ఒక్క‌రే కాదు.. పార్టీలోని మేధావి వ‌ర్గం కూడా ఓటు బ్యాంకుపై దృష్టి పెట్ట‌కుండా.. పార్టీల‌ను క‌లుపుకొని పోతామనే పాలిటిక్స్ వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంటి?  అధికారం కోస‌మే.. అయితే.. 2014లో ఎందుకు ఛాన్స్ మిస్ చేసుకున్నారు?  2019లో ఎవ‌రు మాత్రం ఒంటరిగా పోరు చేయ‌మ‌న్నారు? అప్పుడే.. పొత్తులు పెట్టుకుని ఉంటే బాగుండేది క‌దా.. కొన్ని కొన్ని నిర్ణ‌యాల‌తో కేడ‌ర్ బాగా దెబ్బ‌తినేసింది. కేడ‌ర్‌ను కాపాడు కోవ‌డం మానేసి.. స్వ‌ర్గానికి ఎగురుతాన‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తే..ఎవ‌రికి ప్ర‌యోజ‌నం?`` అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి దీనిని బ‌ట్టి.. ప‌వ‌న్‌.. త‌న వ్యూహాలేమిటో.. సుస్థిరం చేసుకుంటే మంచిద‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: