జగన్ ని వదిలిపెట్టనీ షర్మిల..? అన్నంత పని చేశారు గా!
సెకీతో ఒప్పందాలపై లోతుగా పరిశీలన చేయాలని కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ లేఖ రాస్తున్నామని.. ఇదే సమయంలో.. సెకి ఒప్పందంపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించిన షర్మిల..తాజాగా అన్నంతపని చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ముందుగా ప్రకటించినట్లుగానే ఏసీబీకి షర్మిల ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతు.. అదానీ అనే పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఓ విద్యుత్ ఒప్పందం చేసుకునే క్రమంలో... నాటి ముఖ్యమంత్రి జగన్ కు రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారనే విషయం అమెరికా దర్యాప్తు సంస్థలు బయట పెట్టాయని అన్నారు.
అదానీ 2021 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారని.. సోలార్ పవర్ డీల్ ఆంధ్ర రాష్ట్రం 7వేల మెగావాట్లు కొనేటట్టుగా డీల్ మాట్లాడుకునే విషయంపై వీరిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం రూ.1,750 కోట్లు లంచం వ్యవహారంపై పలు ప్రూఫ్స్ తెరపైకి తెచ్చి ట్రయల్ కూడా యూఎస్ లో మొదలుపెట్టబోతున్నారని అన్నారు.
ఇంతపెద్ద డీల్ మన రాష్ట్రంలో 2021లోనే జరిగితే మన రాష్ట్రమో, మన దేశమో ఎందుకు బయట పెట్టదు అని ప్రశ్నించిన షర్మిల... మన దేశంలో దర్యాప్తు సంస్థలు లేవా అని ప్రశ్నించారు. 2021లోనే ఇప్పటి మంత్రి పయ్యావుల కేశవ్ ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ వేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ ఎందుకు చర్యలు లేవని ఆమె ప్రశ్నించారు.
పక్క రాష్ట్రంలో రూ.1.99 పైసలకే ఇదే పవర్ సప్లై డీల్ చేసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి జగన్ మాత్రం రూ.2.49 పైసలకు ఒప్పందం కుదుర్చుకున్నారని.. అంటే ఏభై పైసలు ఎక్కువకు చేసుకున్నారని.. అది కూడా 25 ఏళ్లకు ఒకటే లాకిన్ అని.. వ్యాఖ్యానించారు. దీనిపై సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి! వైసీపీ శ్రేణులు ఏం అంటారో చూడాలి.