దేశానికే డేంజర్‌.. కాశ్మీర్ కథలో కొత్త మలుపు?

Chakravarthi Kalyan
కశ్మీర్ సంక్షోభం కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు కశ్మీర్ లోయకు పరిమితం అయిన తీవ్రవాదం ఇప్పుడు జమ్మూ వైపు మళ్లింది. జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు లోయ నుంచి జమ్మూ ప్రాంతానికి పాకడం కొత్త కలవరపాటు. జమ్మూలోని రాయాసి, బడా, కధువా, రాజోరి జిల్లాల్లో ఉగ్రవాదులు తాజాగా పంజా విసిరారు. దీంతో ఆ ప్రాంతాల్లోని పది జిల్లాల్లో అదనంగా 37 క్విక్ రియాక్షన్ టీంలను మోహరించారు. లోయలో లాగా ఏదో ఘాతుకానికి పాల్పడి తప్పించుకు పారిపోవడం ఇక్కడ సాధ్యం కాదు. హిందువులు అధికంగా ఉండే జమ్మూ ప్రాంతానికి ఉగ్రవాదం పాకడం తీవ్రంగా పరిగణించాల్పిన అంశం.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ అనుకూల శక్తులు జమ్మూలో ఉగ్రవాదం పెంచేందుకు తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పోలీస్ డైరెక్టర్ అన్న మాటలు.. కొన్ని పాత అనుభవాలు సమీక్షించుకోవడానికి, కొత్త వాస్తవాలు గ్రహించడానికి గుర్తుకు వస్తాయి.  

పాకిస్థాన్ ఉగ్ర మూకలను కశ్మీర్ పౌర సమాజంలోకి చొప్పిస్తున్నదంటే అందుకు కారణం ప్రాంతీయ పార్టీలే అని జమ్మూ కశ్మీర్ డీజీపీ చెప్పుకొచ్చారు. జమ్మూ ఏన్ఎంలో విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ వాదన చిరకాలం నుంచి ఉన్నా.. పెద్దగా చర్చకు నోచుకోలేదు. ఇప్పుడు ఏకంగా పోలీస్ ఉన్నతాధికారి బహిరంగంగా దీని గురించి  చెప్పడంతో కాస్తైనా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనాల కోసం ఉగ్ర కార్యకలాపాలు, వాటి నాయకులు బలపడటానికి దోహదం చేస్తున్నాయని అని కూడా అన్నారు.

ప్రాంతీయ పార్టీలతో పాటు లోయలో ప్రధాన రాజకీయ పార్టీలుగా చెలామణి అవుతున్న వారు కూడా ఈ కార్యకలాపాలకు కారణం అని చెబుతున్నారు. ఒక పక్క ఉగ్రవాదులను సమర్థిస్తూ.. మరొక పక్క సాధారణ ప్రజలపై సానుభూతి చూపిస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఆయా పార్టీలు మోసం చేస్తున్నాయన్నారు.  కశ్మీర్ లోయలో నెత్తురు పారిస్తున్నఉగ్రవాదుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి రావడం సర్వసాధారణంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: