జగన్‌ మంచి పనోడే అంటున్న మోదీ సర్కార్‌..?

Chakravarthi Kalyan
నిజాన్ని దాయొచ్చు.. లేదా రాయకపోవచ్చు. కాకపోతే అబద్ధం సులభంగా అందరినీ చేరుకుంటుంది. అందుకే నిజం గడపదాటేలోగా.. అబద్ధం ఆరు ఊర్లు తిరిగి వస్తుంది అంటారు.  కాకపోతే నిజం నిలకడ మీద తెలుస్తుంది.  అబద్ధం అందంగా అందరికీ నచ్చుతుంది.  తాజాగా రాజ్యసభ, లోక్ సభ వేదికగా కొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి.  

గత వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఎల్లో మీడియాతో పాటు సోషల్ మీడియా విభాగం కూడా బాగా పనిచేసింది.  విపక్ష నాయకులు పదే పదే ఒకే విషయాన్ని చెబుతూ ప్రజల్లో దానిని బలంగా తీసుకెళ్లారు. ఫలితం సార్వత్రిక ఎన్నికల్లో మనకు కనిపించింది. ఏపీలో అభివృద్ధి ఆగిపోయింది. పరిశ్రమలు రావడం లేదు. ఉద్యోగ కల్పన లేదు. రోడ్లు బాగా లేవు. రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ ప్రచారం చేశారు. ఇందులో కొన్ని వాస్తవాలు.. కొన్ని కల్పితాలు ఉన్నాయి.

ప్రస్తుతం వాస్తవాలు మాట్లాడుకుంటే.. అసలు ఏపీలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి. వీటిలో చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు ఎన్ని. ఎన్ని కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి వంటి వివరాలను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు అడగ్గా.. ఏపీలో గత మూడేళ్లలో 2021-22 నుంచి ఈ నెల 16 వరకు 17,09,850 సూక్ష్మ, , చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఎంఎస్పీఈలు ఉజ్జం రిజిస్ర్టేషన్ పోర్టల్ రిజిస్ర్టర్ చేసుకున్నట్లు కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే అధికారికంగా పార్లమెంట్ వేదికగా చెప్పారు.

అలాగే భోగాపురం ఎయిర్ పోర్టుకి సంబంధించి.. వైసీపీ హయాంలో అసలు పనులు ఏమీ ముందుకు సాగలేదు. దీనిని మేమే పూర్తి చేస్తాం అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే దీనిపై కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రి మురళీ ధర్ మోహన్ రాజ్యసభలో వైసీపీ ఎంపీ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ.. జూన్ 2024 నాటికే 31.04 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.  ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని రూపొందిస్తున్నామని.. ఇది 2026 డిసెంబర్ కల్లా పూర్తి అవుతుందని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: