చంద్రబాబు ఫ్యూచర్‌కు ఎసరు పెడుతున్న ఎల్లోమీడియా?

Chakravarthi Kalyan
జగన్ పై దాడి విషయంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తనకు తానే సొంతంగా దాడి చేసుకొని ఎల్లో మీడియా కథనాలు వండి వార్చింది. రాయి తగులుతున్నప్పటి వీడియో బయటకు వచ్చి వీడియో వైరల్ అయింది. జగన్ తనకు తానే మైక్ కేసీ తల కొట్టేసుకొని రాయి తగిలిందని డ్రామా ఆడుతున్నారని.. బంతి అయితే బౌన్స్ అవుతుంది కానీ.. రాయి వెళ్లి ముందుగా జగన్ కు.. ఆ తర్వాత  వెల్లంపల్లికి గీసుకోవడం ఏంటని రకరకాల ప్రశ్నలను ప్రారంభించింది.

మరోసారి దండలు మార్చే సమయంలో పుల్లగీసుకుందని రాసుకొచ్చారు. అయితే ఇన్ని రకాల అనుమానాలతో ఎల్లో మీడియా ప్రజల్లో ఒక రకమైన అయోమయానికి కారణం అయింది. మొత్తానికి ఈ రాళ్ల దాడిలోకి ఎల్లో మీడియా ప్రవేశించి ఈ ఎపిసోడ్ మొత్తాన్ని రక్తి కట్టించింది.
ముందు క్వార్టర్ ఇచ్చారని.. సభకు వచ్చినందుకు డబ్బులు ఇవ్వలేదనే కారణంతోనే రాయి వేసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రాయి వేసిన వ్యక్తి అన్నా క్యాంటీన్ ఎత్తి వేసినందుకు జగన్ పై కోపంతో వేశాడని బోండా ఉమా చెప్పినట్లు వార్త ప్రచురించింది. అంటే ఆ వ్యక్తి ఉమకు తెలిసిన వాడే అనుకోవాలా.. తెలియకపోతే అతను ఏ ఉద్దేశంతో రాయి వేశాడో ఉమా ఎందుకు చెప్పినట్లు. అక్కడితోను ఎల్లో మీడియా ఆగలేదు.

రాయి వేసిన వ్యక్తి వైసీపీ కార్యకర్తే అని.. డబ్బు మందు అందక కోపంతో కొట్టాడని చెప్పుకొచ్చారు. జగన్ పై దాడిని వైసీపీ అత్యుత్సాహంతో టీడీపీ పై నెడుతున్న క్రమంలో ఎల్లో మీడియా అతి స్పందన టీడీపీపై అనుమానాలకు తావిచ్చింది. వాస్తవానికి ఈ పని చంద్రబాబు చేసి ఉంటారా అంటే నమ్మే విషయం కాదు. కానీ ఎల్లో మీడియా ప్రవర్తించిన తీరు చూస్తే టీడీపీకి సంబంధం ఉందేమో అనే అనుమానం కలిగింది. తాజాగా సురేశ్ అనే యువకుడిని పట్టుకోవడం.. అతను బోండా ఉమ అనుచరుడు అని తెలియడం.. బోండా ఉమా సైతం అతిగా స్పందించడం ఇవన్నీ టీడీపీకి ప్రతికూలంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: