కేసీఆర్.. ఇంకెంత మంది "రావు"లు.. దెబ్బ కొడతారో?

Chakravarthi Kalyan
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కాంలో ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో భారీ దోపిడీ కేసులో కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు మీద కేసు నమోదు అయింది. ఇది గులాబీ బాస్ కి తలవంపులు తెచ్చి పెడుతోంది.

ఇప్పటికే కన్నారావుపై హైదరాబాద్ శివారు ఆది భట్ల భూ వివాదానికి సంబంధించి కేసు నమోదు కాగా.. తాజాగా అతడిపై భారీ దోపిడీ కేసు ఫైల్ అయింది. అతడితో పాటు మరో ఐదుగురి మీద కూడా బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు కన్నారావు, ఇతరులపై ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. తనను గెస్ట్ హౌస్ లో నిర్భందించి దాడి చేశారని పేర్కొన్నాడు. అంతేకాక కన్నారావు మరో మహిళతో కలిసి తన వద్ద భారీగా బంగారం, నగలు దోచుకున్నారని పోలీసులకు వివరించాడు.

ఓ సమస్య పరిష్కారం కోసం కొన్ని రోజుల క్రితం సాఫ్ట్ వేర్ ఉద్యోగి విజయ వర్దన్ రావు తనకు న్యాయం చేయాలని కోరుతూ కన్నారావును సంప్రదించాడు. కన్నారావుకి పరిచయస్తురాలైన బిందు మాధవి అలియాస్ నందిని ద్వారా సాఫ్ట్ వేర్ ఉద్యోగి వద్ద భారీగా నగదు, డబ్బులు ఉన్నాయని తెలిసింది.

ఈ క్రమంలో సమస్య పరిష్కారం కోసం తన వద్దకు వచ్చిన విజయ వర్దన్ ను.. నందిని, మరికొందరితో కలసి కన్నారావు గెస్ట్ హౌస్ లో నిర్భందించాడు. అనంతరం అతడిని బెదిరించి రూ.60లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నాడు. తనకు తెలంగాణ పోలీసులు తెలుసంటూ ఒ ఇద్దరి పేర్లు చెబుతూ తనను బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించాడు.  ఇప్పటికే భూ వివాదం కేసులో ఇరుక్కున్న ఆయన దోపిడీ చేశారంటూ మరో ఘటనలో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: