తెలుగు రాష్ట్రాల్లో మోదీ లక్కు మాములుగా లేదుగా?

Chakravarthi Kalyan
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.  వాటిని తట్టుకొని ముందుకు సాగితేనే విజయం దక్కుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి శ్రుతి మించుతుంటాయి. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లి మరీ విమర్శస్తుంటారు. అలా తిట్టిన వారిని మళ్లీ మన దగ్గరికి వచ్చేలా చేసి… వాళ్ల నోటి గుండానే పొగడ్తల వర్షం కురిపించుకుంటే ఆ కిక్కే వేరు.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి ఫైట్ గురించి మన అందరికీ తెలిసిందే. మీడియా సమావేశంలో తొడగొట్టి మరీ.. సవాల్ విసిరారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రేవంత్ మార్క్ విజయం అని పలువురు సోషల్ మీడియా ద్వారా పాత వాటిని ఇప్పటి వీడియోలను జత చేసి షేర్ చేస్తున్నారు.

అయితే అలానే ప్రధాని నరేంద్ర మోదీకి తెలుగు రాష్ట్రాల్లో ఒక అదృష్టం పట్టినట్లయింది. ఇందులో ఆయన చేసింది కూడా ఏమీ లేదు.  2018 నుంచి ఇప్పటి వరకు ఒక విలన్ గా చూపించి పత్రికలు ఒక్కసారిగా ఆయన్ను హీరో గా చూపిస్తున్నాయి. ప్రధానికి వ్యతిరేకంగా.. ఆయన పనై పోయిందని ఒక పేజీలో పుంఖానుపుంకాలు వ్యాసాలు రాసిన పత్రికలు.. ఇప్పుడు కీర్తిస్తున్నాయి.  ప్రధాని పాలనపై తీవ్ర విమర్శలు చేసిన పత్రికలు ఇప్పుడు శక్తిమంతుడు అని ఒప్పుకుంటున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది.  అప్పుడు మాట్లాడిన ప్రతి మాటలు ఇప్పుడు నిముషాల్లో వైరల్ చేస్తున్నారు. గతంలో విమర్శించిన క్లిప్పింగ్ లను ప్రస్తుతం రాసున్న వాటిని కంపేర్ చేస్తూ ఇదీ నరేంద్ర మోదీ సత్తా అని బీజేపీ అభిమానులు గర్వంగా చెబుతున్నారు. ఏ ప్రధాని అయితే మనకి అవసరం లేదు అని దేశ వ్యాప్తంగా కూటమి కట్టే ప్రయత్నం చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే ప్రధాని కోసం దిల్లీలో పడిగాపులు కాసి మరీ పొత్తు కుదుర్చుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కష్టపడకుండా ఇలా  గుర్తింపు రావడం అంటే ప్రధాని అదృష్టవంతుడే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: