విశాఖలో ఆ హోటల్‌ నిర్మాణం.. రాజకీయ యుద్ధం?

Chakravarthi Kalyan
ఏపీలో మీడియా మాఫీయాగా మారిపోయింది. కొన్ని మీడియా ఛానళ్లు రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారిపోయి వాస్తవాలను దాచి పెడుతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికే పరిమితం అవుతూ… ప్రజా ప్రయోజనాలను పక్కన పడేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ కి పెట్టుబడులు రావడం లేదంటూ ఉంటారు. వచ్చే వాటి గురించి ప్రస్తావించరు.

తాజాగా ఓ మీడియా కథనాన్ని చూసుకుంటే.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, కుమార్తె నేహరెడ్డి భాగస్వామ్యంగా ఉన్నఅవ్వాన్ రియల్టర్ ఎల్ఎల్పీ భీమిలి-భోగాపురం బీచ్ రోడ్డులో కొంత కాలం కిందట విలువైన స్థలాలు కొనుగోలు చేసింది. తొలుత బినామీల పరిట అల్సా అనే కంపెనీ కొనుగోలు చేసి.. ఆ తర్వాత అవ్వాన్ రియల్టర్స్ సంస్థ తమ పేరుపైకి బదలాయించుకుంది. ఇక్కడ విజయసాయి రెడ్డి తన కూతురి పేరిట ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

అయితే ఇది ఓ రకమైన పెట్టుబడేగా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ లో నోవాటెల్ మేం వచ్చాక వచ్చింది.. వైజాగ్ లో తాజ్ హోటల్ వచ్చింది అని టీడీపీ అధినేత తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మరీ అలాంటిది ఇప్పుడు వైజాగ్ కి ఓ ఫైవ్ స్టార్ హోటల్ వస్తే గొప్పే కదా. కానీ విజయసాయి రెడ్డి కూతురు పెట్టుబడి పెట్టడం ఎల్లో మీడియాకు రుచించడం లేదు. ఏపీకి పెట్టుబడులు ఎవరు పెడితే ఏంటి. అంతిమంగా ఏపీకి లాభం చేకూరుస్తుందా లేదా అనేది మనకి కావాలి.

నిబంధనలు ఉల్లంఘించి కడుతున్నారని కథనాలు ప్రచురిస్తున్నారు. తాజ్ హోటల్, పార్క్ హోటల్, నోవాటెల్ లు అన్నీ ప్రస్తుత నిబంధనలు అనుసరించి కట్టినవే. వాటికి అడ్డు రాని నిబంధనలు విజయసాయి రెడ్డి కూతురు కట్టే హోటల్ కే వర్తిస్తాయా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక సాంకేతిక సాకు చూపి వీటిని ఆపాలి. చంద్రబాబు రాకపోతే ఈ ప్రాంతానికి పెట్టుబడులు రావు అనే ఒక ప్రచారాన్ని జనంలోకి పంపించాలి. తద్వారా ఓట్ల ద్వారా లబ్ది పొందాలి. ఇదే ఎల్లో మీడియా విధానం అన్న ఆరోపణలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: