కొత్త రికార్డులు సృష్టిస్తున్న అయోధ్య?

Chakravarthi Kalyan
అయోధ్యలోని రామ మందిరంలో రాంలాలాకు పట్టాభిషేకం జరిగి నెల రోజులు కావొస్తోంది.  జనవరి 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆచార వ్యవహారాలతో రామాలయంలో రామల్ లల్లా పట్టాభిషేకంలో పాల్గొన్నారు.  ఇదిలా ఉండగా అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తున్న భక్తుల సంఖ్య మొదటి రోజే 5లక్షలకు చేరింది.  ఎప్పటి నుంచో వేచి చూస్తున్న అయోధ్య రాముడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రామజన్మ భూమిలో కొలువుదీరిన బాల రాముడిని చూసేందుకు నిరీక్షిస్తున్న లక్షల మంది వెల్లువలా తరలి వచ్చారు.

నల్లరాతితో చేసిన రాంలాల దర్శనానికి భక్తుల రద్దీ ఇంకా నెలకొనే ఉంది. అయోధ్య రామాలయం రోజుకో రికార్డులు సృష్టిస్తోంది. రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం దేశ, విదేశాల నుంచి భక్తులు దర్శనానికి వస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో సుమారు 62లక్షల మంది భక్తులు అయోధ్యని దర్శించుకున్నారు. సుమారు రూ.50 కోట్లు విరాళాలు వచ్చాయి.

గడిచిన నెల రోజుల్లో వివిధ పార్టీల నేతలే కాకుండా బాలీవుడ్ తారలు కూడా ఆలయాన్ని సందర్శించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఫిబ్రవరి  11న దాదాపు 300 మంది శాసనసభ సభ్యులతో కలిసి రామమందిరాన్ని దర్శించుకున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామీ కూడా తమ మంత్రివర్గంతో కలిసి బాలరాముణ్ణి దర్శించారు.

ట్రస్తు కార్యాలయ ఇన్ఛార్జి ప్రకాశ్ గుప్తా తెలిపిన వివరాల మేరకు.. గర్భగుడి ముందున్న దర్శన మార్గానికి సమీపంలో నాలుగు పెద్ద సైజు విరాళ పెట్టెలు ఉంచామని అందులో భక్తులు తమ కానుకలు చెల్లించుకుంటున్నారని వివరించారు. ఆలయ ప్రారంభోత్సవం జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇంకా భక్తుల రద్దీ తగ్గలేదు. ఆలయ పాలకవర్గం కొత్త సమయం ప్రకారం ఉదయం 4.30 గంటలకు రాలంలా విగ్రహానికి అలంకార హారతి మొదలవుతుంది. ఉదయం 6.30 పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 7గంటలకు భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరుస్తారు అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: