జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న షర్మిల?

Chakravarthi Kalyan
ఇప్పుడు బంధాలు అనుబంధాల కన్నా ఆస్తిపాస్తులకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు చాలామంది వ్యక్తులు. రాజకీయాల్లో ఈ లెక్క మరింత బలంగా ఉంటుంది. వైయస్ షర్మిలను మొదట్లో అందరూ అన్న వదిలిన అస్త్రంలా భావించారు. ఆ తర్వాత తెలంగాణలో ఆమె సొంతంగా ఒక పార్టీని పెట్టింది. దాంతో అందరూ ఆమె రాజకీయాల్లో దూసుకుపోతుందని అనుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది.


తాను కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళబోయే టైంలో   రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వడం ఆవిడకు పెద్ద ఎదురుదెబ్బే అయ్యింది. అయితే జగన్ తన ఆస్తిపాస్తుల్లోనూ, రాజకీయ వారసత్వంలోనూ కూడా వాటా ఇవ్వకపోవడంతో అన్న మీద అలిగింది వైయస్ షర్మిల. అసలు తమ కుటుంబం నుండి ఎక్కువమంది రాజకీయాల్లో ఉండడాన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా మెచ్చేవారు కాదని అంటారు.


అందుకే ఆయన పరిపాలనా కాలంలో జగన్ని ఏ రాజకీయ విషయంలోనూ జోక్యం చేసుకొనిచ్చేవారు కాదట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పంధాలో వెళుతున్నారని అంటున్నారు. ఈ కారణం మీదనే వైయస్ షర్మిలను పొలిటికల్ గా ఎంకరేజ్ చేయలేదట జగన్. అయితే ఈ విషయం మీద అలిగినటువంటి షర్మిల తన అన్నకు తన అవసరమేంటో చూపించాలని గట్టిగా ఫిక్స్ అయిందట.


ఈ ఆలోచనతోనే  తాజాగా క్రిస్మస్ రోజున తన ప్రత్యర్థి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ యువజన నేత నారా లోకేష్ కు క్రిస్మస్ కానుక పంపిందట షర్మిల. ప్రస్తుతం ఈ విషయం రాజకీయాల్లో ఒక సంచలనగా మారింది. వైయస్ షర్మిల ఎలాగూ కాంగ్రెస్ కి సపోర్ట్ గానే ఉంది . కాబట్టి ఇప్పుడు ఈ క్రిస్మస్ కానుక తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఇవ్వడం ద్వారా తన అన్నకు తాను తెలుగుదేశం పార్టీ వైపుకు మళ్ళబోతున్నానని ఇండైరెక్ట్ గా సూచించింది అని అంటున్నారు రాజకీయ నిపుణులు. మరి జగన్ దీనికి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: