బీఆర్‌ఎస్ నేతలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తారా?
ఇక కాళేశ్వరం, నీటిపారుదల శాఖ లపై సమీక్ష నిర్వహిస్తే మరిన్ని కోట్లు వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధం అవుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేసిన దుర్వినియోగంపై కూడా చర్యలు తీసుకొంటోంది. ఈ క్రమంలోనే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి అప్పులు కట్టాలని నోటీసులు చేసింది.
అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టి సరిగ్గా వారం కూడా కావడం లేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన సందర్భంలోను తనకు ఇష్టం వచ్చిన నేతలకు ప్రమోషన్లు ఇచ్చి అధికారులను మార్చుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అధికారలు ప్రక్షాళన చేపట్టారు. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టలేదు. బాధ్యాతాయుతంగానే ఉన్నారు.
కానీ మాజీ మంత్రి హరీశ్ రావు ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టవచ్చని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు అధైర్య పడొద్దని నాకు సమాచారం అందిస్తే అరగంటలో మీ ముందు ఉంటానని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక అర్థం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. హరీశ్ రావే తమ కార్యకర్తలపై హింట్ ఇస్తున్నారని.. కావాలనే హరీశ్ రెచ్చగొడుడున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా పాలన ప్రారంభించని ప్రభుత్వంపై అప్పుడే కేటీఆర్ , హరీశ్ రావులు విమర్శలు మొదలు పెట్టారు.