జగన్‌కు తలనొప్పిగా మారిన రఘురామ?
లోక్ సభ ఎంపీగా గెలిచిన ఏడాదిలోపే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం.. రఘురామను సీఎం జగన్ అరెస్టు చేయించి పోలీసులతో కొట్టించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన వైసీపీ నుంచి గెలిచినా కూడా జగన్ కు వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా పని చేస్తూనే ఉన్నారు. జగన్ ను ప్రతి రోజు వెంటాడుతూనే ఉన్నారు. టీడీపీ, జనసేన కంటే రఘురామ కృష్ణంరాజు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి సమయం సరిపోవడం లేదు. ఎందుకంటే ఇద్దరి మధ్య అంతలా విబేధాలు వచ్చాయి. కొన్ని విషయాల్లో అయితే తారాస్థాయికిి చేరాయి.
అయితే ప్రస్తుతం జగన్ పై హైకోర్టులో మళ్లీ రఘురామ కేసు వేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో 10 సంవత్సరాల నుంచి బయటే ఉంటున్నారు. ఆయన కేవలం బెయిల్ పై బయటకు వచ్చారు. ఆయన్ని జైలుకు పంపాల్సిన అవసరముందని కేసు వేశారు. సొంత పార్టీలోనే గెలిచి పక్కలో బెల్లంలా జగన్ కు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.
ఇలాంటి సమయంలో కేసు విషయంలో మళ్లీ ఏమైనా పురోగతి ఉంటుందా లేక తెలంగాణ హైకోర్టులో ఇలాగే కేసు వేస్తే దాన్ని అక్కడి కోర్టు తోసి పుచ్చింది. కాబట్టి టీడీపీ, జనసేన పార్టీ నాయకుల కంటే కూడా రఘురామ జగన్ పై ప్రత్యేక దృష్టి సారించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మరి ఇప్పుడు వేసిన ఈ కేసులో రఘురామకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం జగన్ కు తిప్పలు తప్పేట్లు లేవు.