ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసులో మెగా ట్విస్ట్‌?

Chakravarthi Kalyan
కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడి కేసులో అసలైన నిందితుడిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయకపోవడం ఆశ్యర్యానికి గురి చేస్తుంది. డ్రైవర్ ను నడిరోడ్డుపై బస్సు ఆపి 14 మంది కలిసి ఇష్టమొచ్చినట్లు కొడితే బస్సులో ఉన్న వారు జోక్యం చేసుకోలేదు. కొంతమంది అడ్డం వెళితే వారి ఫోన్లు తీసుకుని పగలగొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

అంటే ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిలో కొంతమందినే గుర్తించి వారిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే అసలు నిందితుడు సుధీర్ ను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. అయితే డేర్ గా ప్రతి విషయాన్ని గొప్పగా రాస్తామని చెప్పుకునే ఓ  దిన పత్రిక కూడా దాడికి పాల్పడిన నిందితుడి పేరు రాయడానికి భయపడింది. తన పత్రికలో ఓ వ్యక్తి అని రాసుకొచ్చింది. అసలు ఒక ఆర్టీసీ డ్రైవర్ పై ఇంత దారుణానికి పాల్పడిన వ్యక్తిని ఇంత వరకు అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యమని చెబుతున్నారు.

ఇదే సమయంలో దాడికి పాల్పడిన వ్యక్తి వైసీపీ, జనసేన, టీడీపీకి చెందిన వ్యక్తని ఎవరికి వారే విమర్శలు చేస్తున్నారు. మరి ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తిని ఎలా విడిచిపెడతారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా వారి అధినేతలు ఇలాంటి దాడులకు పాల్పడమని చెప్పరు. కాబట్టి కచ్చితంగా అతడిని వెంటనే అరెస్టు చేయాలి. సమాజంలో ఇలాంటి ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

14 మంది కలిసి ఒక డ్యూటీలో ఉన్న వ్యక్తిని అతి దారుణంగా కొట్టడం, తన్నడం చూస్తుంటే ఇదెక్కడి దారుణం అని ప్రజలు అనుకుంటున్నారు. బండి విల్సన్, షేక్ కలీం, పుట్ట శివకుమార్, షేక్ ఇలియాస్, షేక్ బాజీ తదితరులను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు అసలైన నిందితుడిని మాత్రం ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. సుధీర్ అనే వ్యక్తి  గతంలో లోకల్ ఎమ్మెల్యే పై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: