ఏపీ:కూటమి గెలిస్తే ఫస్ట్ అమలయ్యే పథకం ఇదేనట..!

Pandrala Sravanthi
ఎన్నికలు వచ్చాయంటే చాలు  పార్టీలు, నాయకుల మధ్య మాటల తూటలు పేలుతుంటాయి. ఒకరిపై ఒకరు విపరీతమైన విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అలాగే పార్టీల మార్పులు, చేర్పులు, టికెట్ల పంచాయితీ  ఇలా నామినేషన్ల వరకు ఎంతో హడావిడి ఉంటుంది. ఎవరికి వారే మేం గెలుస్తామంటే, మేం గెలుస్తామనే భీమా వ్యక్తం చేస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి పరుగులు పెడుతూ ఉంటారు. అయితే పార్టీలకు ఇవన్నీ ఒకేత్తు అయితే  వారి యొక్క మేనిఫెస్టో మరో ఎత్తు అని చెప్పవచ్చు. పార్టీల మేనిఫెస్టోలు అద్భుతంగా ఉంటే  ప్రజలు కూడా ఆదరిస్తారు. 

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మేనిఫెస్టోల ప్రచారం సాగుతోంది. మొన్నటికి మొన్న జగన్ నవరత్నాలు పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేస్తే, టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులైన  చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిజెపి జాతీయ నేత సిద్ధార్థ నాథ్ సింగ్  కలిసి   ఈరోజు అట్టహాసంగా మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా  టిడిపి, వైసిపి మేనిఫెస్టో గురించే చర్చ సాగుతోంది. రెండు మేనిఫెస్టోలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏ పార్టీ పథకాలు బాగున్నాయి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే ఆలోచనలో పడ్డారు. అయితే వైసీపీ గత పథకాలను కాస్త పెంచేసి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది.

 పూర్తిగా కొత్త కొత్త పథకాలతో  మేనిఫెస్టో తీసుకు వచ్చింది. దీంతో ఈ రెండు పార్టీల మేనిఫెస్టోపై భిన్న అభిప్రాయాలు  వ్యక్తం చేస్తున్నారు. వైసిపి పథకాలు ఏమో  రాష్ట్ర బడ్జెట్ కు అనుగుణంగా ఉన్నాయని ఆ పథకాలను అమలు చేయడం ఈజీ అని అంటున్నారు. కానీ టిడిపి మేనిఫెస్టోలో ఉన్న పథకాలు  మన రాష్ట్ర బడ్జెట్ తో  అమలు చేయడం సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు. కానీ చంద్రబాబు మేనిఫెస్టోలో అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు, ఎన్నో పథకాలు మహిళలను బేస్ చేసుకుని మరి అందులో పొందుపరిచారు.

అయితే ఇదే తరుణంలో  ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే  ముందుగా ఈ పథకంపై మాత్రమే తొలి సంతకం పెడతారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటయ్యా అంటే  మెగా డీఎస్సీ. కూటమి అధికారంలోకి వస్తే  చంద్రబాబు మెగా డీఎస్సీ పైన మొదటి సంతకం పెడతారని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే వైసిపి ముందుగా అమలు చేసే పతకం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే వారు పెట్టిన మేనిఫెస్టోలో పథకాలన్నీ పాతవే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: