టి20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన.. ఈసారి ఆ తప్పు చేయని సెలెక్టర్లు?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ గత కొన్ని రోజుల నుంచి టి20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా వరల్డ్ కప్ టోర్నీలలో బాగా రాణిస్తూ ఉన్నప్పటికీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఓడిపోయి అభిమానులు అందరినీ కూడా నిరాశ పరుస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఈసారి టి20 వరల్డ్ కప్ లో మాత్రం తప్పకుండా విజయం సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకుంది టీమిండియా.

 అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు రెడీ అవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక భారత జట్టులో ఎవరు సెలెక్ట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఐపీఎల్ లో బాగా రాణించిన ఆటగాళ్లని ఇక జట్టులోకి సెలక్ట్ చేసే అవకాశం ఉంది అని అభిమానులందరూ కూడా అంచనా వేశారు. అయితే ఒక్క ఆటగాడు విషయంలో మాత్రం సెలెక్టర్లు మళ్లీ తప్పు చేసారేమో అని క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా అనుకున్నారు.. ఆ ఆటగాడు ఎవరో కాదు సంజూ శాంసన్.  గత కొంతకాలం నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నప్పటికీ సెలెక్టర్లు మాత్రం వరల్డ్ కప్ ఎంపిక సమయంలో అతని పరిగణలోకి తీసుకోవట్లేదు.

 ఎవరైనా ఆటగాడు గాయపడినప్పుడు అతన్ని వరల్డ్ కప్ లోకి తీసుకున్నట్లు చేసి మళ్లీ ఇంటికి పంపించేయడం చేస్తున్నారు. దీంతో అతనికి అన్యాయం జరుగుతుందంటూ ఎంతోమంది విమర్శలు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు t20 వరల్డ్ కప్ కోసం మాత్రం సంజూని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్థాన్ కెప్టెన్ గా, ఆటగాడిగా కూడా సూపర్ సక్సెస్ అవుతున్న సంజూ శాంసన్ ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే సెలెక్టర్లు ఈసారి సంజూ శాంసన్ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని అతని వరల్డ్ కప్ జట్టులోకి ఎంపిక చేసి మంచి పని చేశారు అంటూ భారత క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: