లోకేష్‌ ఆ మూడు పనులు చేస్తే.. జగన్‌ ఔట్‌? E

Chakravarthi Kalyan
మామూలు రోజుల్లో ప్రతి ఒక్కరూ నాయకుడిగా చెలామణి అవుతుంటారు. అయితే సంక్షోభం సమయంలో నిలబడి పోరాడగలిగినా వాడే అసలైన నాయకుడని అంటుంటారు. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేశ్ తన నాయకత్వాన్ని నిరూపించుకుంటున్నాడు. దీని కోసం లోకేశ్ ప్రస్తుతం జాతీయ రాజధాని ఢిల్లీలో మకాం వేసి అక్కడి లాయర్లు, కేంద్రంలోని మంత్రులు ఇతర ప్రముఖులతో బాబును అక్రమంగా అరెస్టు చేశారని జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని అని చెబుతూ వారి నుంచి మద్దతు కోరుతున్నారు.

అదే సమయంలో ఎలాగైన చంద్రబాబును విడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రలో పార్టీ దెబ్బతినకుండా నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను ఇక్కడ ఉండి కార్యకర్తలు బాబు అరెస్టుకు నిరసన తెలిపే కార్యక్రమం చేపడుతున్నారు.  ఈ విషయంలో మాాత్రం లోకేశ్ తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఇన్ని రోజులు చంద్రబాబు కొడుకుగా మాత్రమే అందరికీ తెలిసిన లోకేశ్ ప్రస్తుతం ఆయన అరెస్టు తర్వాత తన నాయకత్వాన్ని నిరూపించుకుంటున్నాడు.

ముఖ్యంగా బాబు అరెస్టు గురించి వ్యతిరేక కథనాలు ప్రచురించే వారికి ధీటుగా సమాధానమిచ్చేలా టీడీపీ సోషల్ మీడియాలో తన టీంను యాక్టివ్ చేశారు. అదే విధంగా వివిధ దేశాల్లో ఉన్న టీడీపీ మద్దతుదారులు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి మద్దతు ఇచ్చేలా కార్యక్రమాలు చేయాలని అదే సమయంలో బాబు అరెస్టును ఖండించే విధంగా నిరసనలు చేపట్టేలా చేస్తున్నారు.

అయితే ఆయన మరో మూడు అంశాలపై చర్యలు తీసుకోవాలి. బాబే మా భవిష్యత్తు ఇంటింటికీ కార్యక్రమం. 175 మంది ఎమ్మెల్యేలను అనౌన్స్ చేయడం అది బాబుతోనే చర్చించి ప్రకటించేస్తే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్యాండిడేట్ ప్రకటించేస్తే నియోజకవర్గాల్లో మరింత దూకుడుగా వెళ్లొచ్చు. ఎందుకుంటే పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత చురుకుగా ప్రజల్లోకి వెళతారు. అప్పుడు జగన్ చేసిన కక్ష సాధింపును కూడా చెప్పొచ్చు. దీంతో టీడీపీకి అనుకూల ఓట్లు పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: