పార్టీ ఫిరాయింపుదారులకు సుప్రీం బిగ్‌ షాక్‌?

Chakravarthi Kalyan
ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్యేలకు రక్షణ ఉంటుందా అనేది ఇప్పుడు తేలబోతోంది. డబ్బులు, ప్రలోభాలకు లోనై పార్టీ మారడం అవినీతి కిందికి వస్తుందా అనేది ఇప్పుడు సుప్రీం కోర్టు తేల్చబోతోంది. చట్ట సభల్లో అవినీతి చర్యలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపు 1998లో వెలువడిన తీర్పును పునః పరిశీలించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.  దీనికోసం ఏడుగురు సభ్యుల విస్త్రృత ధర్మాసనం ఏర్పాటు చేయనుంది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇటీవల ఈ విషయం తెలిపింది. జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012 రాజ్య సభ ఎన్నికల్లో ఆ పార్టీ శాసన సభ సభ్యురాలు సీతా సోరేన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తానని డబ్బులు తీసుకొని మరొకరికి ఓటు వేసిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఈ క్రిమినల్ కేసును కొట్టివేయాలని ఆమె తొలుత జార్ఖండ్ హైకోర్టును కోరగా తిరస్కరించారు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్ట సభల్లో అవినీతికి పాల్పడితే వాళ్లపై చర్యలు తీసుకోవచ్చా అని 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించి.. ఈ కేసుకు ప్రాముఖ్యం ఉందంటూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. తాజాగా ఆ కేసును పరిశీలించి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం సభలో చేసే ప్రసంగాలు అక్కడి వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగ పరమైన రక్షణ ఉంటుందని పీవీ నరసింహరావు వర్సెస్ సీబీఐ కేసులో 1998లో వెలువడిన తీర్పును పునఃపరిశీలిస్తామని తెలిపింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారి వారిని విమర్శిస్తే  ఏం కాదు. గెలిచిన పార్టీలోనే ఉంటూ ఆ పార్టీకి రెబల్స్ లా  మారితే చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేరు. ఇప్పుడు ఎవరైనా పార్టీలు మారకుండా విమర్శలు చేస్తే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అప్పుడైనా ఫిరాయింపు సంస్కృతి మారుతుంది ఏమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: