ఇది జగన్‌.. ఎన్నాళ్లో వేచిన ఉదయం?

Chakravarthi Kalyan
చంద్రబాబు అరెస్టు తర్వాత జగన్ నోరు వెంటనే విప్పలేదు. అయితే మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవాల సందర్భంగా ఆయన స్పందిస్తాడని ఎదురు చూశారు. కానీ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవాల సందర్భంగా చాలా మంది బాబు అరెస్టు పై జగన్ మాట్లాడతారని అనుకున్నారు. కానీ ఆయన మాట్లాడలేదు. కేవలం అది అభివృద్ధికి సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి అక్కడ స్పందించలేదు.

కానీ కాపు నేస్తం సంక్షేమానికి సంబంధించిన ప్రొగ్రాంలో మాట్లాడారు. నిడదవోలులో జరిగిన ఈ సభలో చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. ఇటీవల సాక్ష్యాలు, ఆధారాలతో దొరికిపోయిన మహానుభావుడు చంద్రబాబు గురించి నాలుగు వ్యాఖ్యాలు చెబుతాను అని ప్రసంగించారు. దోపిడీనే రాజకీయంగా మార్చుకున్న వ్యక్తి బాబు అన్నారు. దురదృష్టం ఏమిటంటే ఎంత దోచుకున్నా.. ఎన్ని కుట్రలు చేసినా ఎంత అవినీతి చేసినా ఆయన్ని కాపాడేందుకు బాబు చుట్టూ దొంగల ముఠా ఉంది.

కానీ చట్టం ముందు అందరూ సమానులే అన్న విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు. మామూలు వ్యక్తి తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పే దొంగల ముఠా చంద్రబాబు తప్పు చేస్తే మాత్రం ఆయన చట్టానికి అతీతుడు అనే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ దొంగల ముఠా సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కొనుగోలు విషయంలో అడ్డంగా దొరికినా కూడా చివరకు ఆడియో రికార్డింగ్ లో చంద్రబాబు వాయిస్ ఉన్నా కూడా తనది కాదని తప్పించుకుతిరుగుతున్నాడు.

ఫొరెన్సిన్ లో వాయిస్ చంద్రబాబుదేనని చెప్పినా కూడా ఆయన వాటాదారులు, ఎల్లో మీడియా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి. స్కిల్ ఒప్పందంతో తమకు సంబంధం లేదని సిమన్స్ కంపెనీ చెబుతున్నా.. ఈడీ ఈ విషయంలో అవినీతి జరిగిందని కొంతమందిని అరెస్టు చేసినా, చంద్రబాబు వైట్ కంపెనీలకు అక్రమంగా డబ్బులు తీసుకెళ్లినా కూడా తప్పు కాదని అంటున్నారు. మాట్లాడితే చాలు ప్రశ్నిస్తా అని గొంతు చించుకు అరిచే పవన్ సైతం పరామర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: