జగన్‌ ధాటికి తట్టుకోలేక.. పవన్‌ పారిపోతారా?

Chakravarthi Kalyan
పవన్ కళ్యాణ్  నిత్యం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూనే ఉంటారు. అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే పనులను, విధి విధానాలను ప్రశ్నిస్తూ ఉంటారు‌. అలాగే మొన్న స్వాతంత్ర దినోత్సవం నాడు చేసిన ప్రసంగంలో కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటిలానే జగన్ ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గద్దె దిగితే గాని రాష్ట్రం బాగుపడదని ఆయన అన్నట్లుగా తెలుస్తుంది.


అయితే ఈ విమర్శలు అనేవి ఎప్పుడూ ఒకరిపై ఒకరు జరుపుకుంటూనే ఉంటారు. ఇలాంటి విమర్శలు చేయడం కూడా తప్పు కాదు. ఎందుకంటే అది ఆయన ఉద్దేశం కాబట్టి. అయితే అదే ప్రసంగంలో పవన్ కళ్యాణ్ మరొక కీలకమైన విషయాన్ని కూడా లేవనెత్తారు. జగన్ ప్రభుత్వం లో ఉండలేక  కొంత మంది రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతున్నారని ఆయన అనడం జరిగింది. అయితే గతంలో కూడా కొంతమంది భారతదేశం పద్దతి తనకు నచ్చడం లేదని, భారత దేశం నుండి తాము బయటకు వెళ్లిపోతామని  అనడం జరిగింది.


అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఇదేవిధంగా రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడానికి సిద్ధం అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో ఉన్నటువంటి కుట్రలు, కుతంత్రాలు అనేవి పెద్దగా తెలియవని కొంత మంది రాజకీయ నిపుణులు అంటున్నారు. పవన్ ఇలా రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాను అనే వారి లోగుట్టును తెలుసుకోవాలని వాళ్లు అంటున్నారు.


ఈ రాష్ట్రానికి గాని, ఈ దేశానికి గాని ఏమీ చేయలేనటువంటి ఏ వ్యక్తి అయినా బయటికి వెళ్లిపోతానంటే బాధపడవలసిన అవసరం లేదని వాళ్లు అంటున్న మాట. ఒక రాజకీయ నాయకుడు కానీ మరొక వ్యక్తి గాని, మరెవరైనా సరే రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతాను అంటున్నారంటే దాని అర్థం వేరే ఉంటుందని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ దోచుకోవడానికి అవకాశం లేకే ఈ రాష్ట్రం నుండి గాని, దేశం నుండి గాని వెళ్ళిపోదాం అనుకుంటారట వాళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: