ఉక్రెయిన్‌: యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని జెలెన్ స్కీ అవినీతి చేస్తున్నాడని వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని ఆరోపించింది. మామూలుగా కాకుండా పూర్తి ఆధారాలతో ఈ వివరాలను బయట పెట్టింది.అయితే అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు భారీ గా ఆయుధాలను అందిస్తున్నాయి. కానీ రష్యా చేసిన ఆరోపణలతో ఒక్క సారిగా జెలెన్ స్కీపై చాలా మందికి అనుమానాలు కలుగుతున్నాయి.

దేశం కోసం పోరాడుతున్నమని చెప్పి ఇలాంటి పనులకు పాల్పడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం తన మంత్రి వర్గంలో ఉన్న కొంతమంది యుద్ధాన్ని అడ్డు పెట్టుకుని ఆయుధాలను అమ్ముకుని అవినీతి పాల్పడినట్లు తేలిందని అందుకే వారందరినీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే సమస్య మంత్రి వర్గంలో ఉన్న వారు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. ఒక పక్క దేశం యుద్ధంతో అల్లాడిపోతుంది. దేశాన్ని కాపాడాల్సిన వారు ఇలా అక్రమాలకు పాల్పడడం చూస్తుంటే ఉక్రెయిన్ ఏమైపోతుంది ఎటు వెళుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అమెరికా కూడా ఉక్రెయిన్ లోని విదేశాంగ శాఖలో చాలా మంది అవినీతికి పాల్పడ్డారని ఆడిటింగ్ లో తేల్చింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు తన మంత్రి వర్గ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా అమెరికా, ఇతర దేశాలు చేస్తున్న సాయాన్ని పక్క దారి పట్టించకుండా చూడాల్సిన బాధ్యత తీసుకున్నారు.

కానీ జెలెన్ స్కీయే అతి పెద్ద అవినీతి పరుడని రష్యా ఆరోపిస్తుంది. సైనికుల ప్రాణాలపై చెలగాటమాడుతూ డబ్బులు సంపాదించుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఉక్రెయిన్ అధ్యక్షుడే అని రష్యా చెబుతోంది. ఇప్పటికైనా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని నమ్మ వద్దని కోరుతుంది. మరి జెలెన్ స్కీ విషయంలో అమెరికా, యూరప్ దేశాలు ఏమనుకుంటున్నాయి. ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: