టీడీపీలో ఆశలు రేపుతున్న ఆ సర్వే?

Chakravarthi Kalyan
ఇండియా టీవీ సర్వేలో 2019 ఎన్నికల్లో వైసీపీ 50 శాతం, టీడీపీ 40, జనసేనకు 6, బీజేపీ 0.8 శాతం వస్తాయని చెప్పింది. దాదాపు అదే రేంజ్ లో రావడం వైసీపీ గెలవడం జరిగింది. ఈ దపా చేసిన సర్వేలో వైసీపీ ఓటింగ్ శాతం 46 కు పడిపోతుందని చెప్పింది. దీంతో పాటు టీడీపీ ఓటింగ్ శాతం కూడా 36 శాతానికి పడిపోతుందని తెలిపింది.

జనసేన, బీజేపీ కూటమి కలిపి ఒక శాతం పెరిగింది. కాంగ్రెస్ కు కూడా ఓటింగ్ శాతం 1 శాతం నుంచి 3 శాతాానికి పెరిగింది. తెలుగు దేశం అనుకూల మీడియా 2019 ఎన్నికల్లో గానీ, ప్రస్తుతం జరుపుతున్న ఈ సర్వేలను గానీ హైలైట్ చేసి చూపించడం లేదు. అసలు అవి వార్తలు కావన్నట్లు చేస్తున్నారు. కానీ లగడపాటి చేసిన సర్వేలను మాత్రం తెగ చూపించేశారు.

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో లగడపాటి చేసిన సర్వేలో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఏమైంది చివరకి అక్కడ బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించింది. ఆ తర్వాత చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ గెలుస్తుందని లగడపాటి సర్వే లో తెలిపారు. కానీ చిత్తుచిత్తుగా టీడీపీ ఓడిపోయి 23 స్థానాలకే పరిమితమైంది. ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా నిజం కాకపోవడంతో అప్పటి వరకు చేసిన లగడపాటి రాజగోపాల్ క్రెడిట్ మొత్తం పోయింది.

రఘురామకృష్ణంరాజు ఏదో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీకి రెండు, లేదా మూడు ఎంపీ స్థానాల కంటే ఎక్కువ రావని, దాదాపు 20 నుంచి 30 స్థానాలకే ఎమ్మెల్యేలు పరిమితమవుతారని అన్నారు. దీన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధానంగా ప్రచురించింది. కానీ ఇండియా టీవీ చెబుతున్న సర్వే మాత్రం చెప్పడం లేదు. అంతే టీడీపీకి ఎవరూ అనుకూలంగా మాట్లాడితే వారి గురించి గొప్పగా చెప్పడం నేర్చుకుంటే చాలని తీరులో ఆంధ్రలో మీడియా చానళ్లు పని చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: