పవన్‌ కల్యాణ్‌.. టీడీపీకి ఊపిరి పోస్తున్నాడా?

Chakravarthi Kalyan
వారాహి యాత్ర ప్రారంభమైన తర్వాత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై తన దైన శైలిలో విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో తానేందుకు సీఎం కాకుడదని అనడంతో తెలుగు దేశం పార్టీతో పొత్తు ఉంటుందా ఉండదా అనే ఊగిసలాట మొదలైంది. టీడీపీ అనుకూల మీడియా సైతం నారా లోకేశ్ పాదయాత్రను అప్పటి వరకు హైలైట్ చేసి, పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలు కాగానే వెంటనే దీనికి కవరేజ్ ఇవ్వడం మొదలెట్టారు.
 

పవన్ కల్యాణ్ కు ప్రజల్లో ఉన్న క్రేజ్ పిలవకున్న వచ్చే అభిమానులతో ప్రతి సమావేశం కిక్కిరిసిపోతుంది. ఇదే సమయంలో జనసేనను అధికారంలోకి తీసుకురావడానికి శాయ శక్తులా కృషి చేస్తానని ఈ సారి కచ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టేలా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అదే సమయంలో టీడీపీతో పొత్తు ఉంటుందా అనే అంశంపై స్పష్టత ఇవ్వకుండా తానే సీఎం ఎందుకు కాకుడదు అనడంతో గందరగోళం నెలకొంది.


గతంలో జగన్ ను ఓడించేందుకు ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించిన జగన్ ఒక్కసారి వారాహి యాత్ర మొదలయ్యాక తానే సీఎం అని అనడంతో టీడీపీ వర్గాలు షాక్ కు గురయ్యాయి. చంద్రబాబును కాదని టీడీపీ పవన్ సీఎం క్యాండిడేట్ అని ఒప్పుకోవడం అసాధ్యం. ఇలాంటి సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యుహాత్మక మౌనం పాటించారు. పవన్ సీఎం అనగానే వెంటనే విమర్శలు చేయలేదు.


నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ మిత్ర పక్షాల కూటమి సమావేశానికి ఏపీ నుంచి టీడీపీ, వైసీపీలకు ఆహ్వానం అందలేదు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి కూడా రాలేదు. ఇదే సమయంలో ఎన్డీఏ నుంచి జనసేనకు పిలుపువచ్చింది. అక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పవన్ మాట్లాడుతూ.. టీడీపీ సమావేశానికి రాకున్నా ఆంధ్రలో జగన్ ను గద్దె దించేందుకు వారిని కలుపుకుని వెళతానని ప్రకటించారు. దీంతో టీడీపీ వర్గాలకు ఊపిరి పోసినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: