రేవంత్ రెడ్డి చేతులారా చేసుకున్నాడా?
అయితే రేవంత్ విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ నాయకులు అవినీతి చేస్తున్నారని, కొనుగోలు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఉద్దేశంలో అన్నారు. దీన్నిబీఆర్ఎస్ నాయకులు 24 గంటల విద్యుత్ అవసరం లేదని కాంగ్రెస్ అధ్యక్షడు రేవంత్ రెడ్డి ఎలా అంటారని మండి పడుతున్నారు. ఊరూరా దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే రైతులకు మళ్లీ పాత రోజులు వస్తాయని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వచ్చింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. సీఎం కేసీఆర్ సర్కారు రుణమాఫీ చేయలేదు గనక ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఇలా కాంగ్రెస్ కు పాజిటివ్ ప్రచారం జరుగుతున్న సమయంలో అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాష్ట్రంలో మంటలు పుట్టించాయి.
కాంగ్రెస్ వస్తే 24 గంటల కరెంట్ ఎత్తేస్తారని, ధరణిని కూడా రద్దు చేస్తామని అన్నారని తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు మండి పడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. పోటా పోటీగా కాంగ్రెస్ కూడా ధర్నాలు చేసింది. సబ్ స్టేషన్లలో లాగ్ బుక్ చూస్తే తెలిసిపోతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనడంతో వివాదం మరింత ముదిరిపోయింది.