మోడీ అమెరికా టూర్‌- అసలు కారణం ఇదా?

Chakravarthi Kalyan
ఈ మధ్య మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన అమెరికాకి వెళ్లాలనుకోవడం, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆయనని పిలవడం ఒకేసారి జరిగాయట. అయితే నరేంద్ర మోడీ అంత అర్జెంటుగా అమెరికా పర్యటనకు వెళ్లడానికి గల కారణం చైనా అధ్యక్షుడు జింపింగ్ అని తెలుస్తుంది. అలాగని జింపింగ్ చెప్తే మోడీ అక్కడికి వెళ్లడం లేదు.

కానీ పరోక్షంగా జింపింగ్ వల్లే అక్కడికి వెళ్లారు నరేంద్ర మోడీ. విషయం ఏమిటంటే చైనాలో జింపింగ్ చేస్తున్న ఘాతుకాల వల్ల అక్కడ ప్రజల్లో ఆయన మీద ఆదరణ తగ్గిపోయినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో జింపింగ్ తన దేశం మీద పట్టు కోల్పోతున్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు చైనా అధ్యక్షుడు తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు భారత్ తో గాని, తైవాన్ తో గాని యుద్ధం చేసి విజయం సాధించి చూపించకపోతే చైనాలోని ప్రజలే ఆయనను, ఆయన సామర్థ్యాన్ని నమ్మలేనటువంటి పరిస్థితి ఏర్పడింది.

అందుకే భారత్ లో గాల్వాన్ లోయ వద్ద ఎటాక్, సిల్క్ రోడ్డు పేరుతో  పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వివాదం ఇలా ఏదో ఒకటి సృష్టిస్తున్నాడు. ఇప్పటికే చైనాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా దెబ్బతిన్నది. విద్యా, ఉద్యోగం, ఉపాధి ఇలా ప్రతి అవకాశం కోసం జనాలు బయట దేశాలకు వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన పార్టీలోని వాళ్లే తనను గద్దె దించేసే ప్రమాదం ఏర్పడుతుందని ముందుగానే పరిస్థితిని గ్రహించాడు చైనా అధ్యక్షుడు.

అందుకే భారత్ తో యుద్ధానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. భారత్ ను యుద్ధంలో ఓడించి మరొక పది వేల కిలోమీటర్లు ఆక్రమించుకుంటే తన సత్తా తన దేశంలో నిరూపించుకునే అవకాశం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయం. అయితే చైనా అధ్యక్షుడు కుట్రను ముందే గుర్తించిన  మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బైడెన్ సహాయం కోరి అమెరికా వెళ్ళినట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: