రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

Chakravarthi Kalyan
రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో జర్మనీకి గ్యాస్, పెట్రోల్, డీజిల్ అందించే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ 1 & 2 ధ్వంసం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విధ్వంసం చేసింది రష్యానే అని అమెరికాతో పాటు యూరప్ దేశాలు కూడా రష్యాని టార్గెట్ చేసాయి. మాకు ఆదాయం  అందించే పైప్ లైన్ ని మేమెందుకు ధ్వంసం చేస్తాం, ఈ పని మీరే చేయించి ఉంటారు అంటూ ఆ దేశాలను నిలదీసింది రష్యా.

తాజాగా పులిట్జెర్ అవార్డు గ్రహీత అయినటువంటి హార్ష్ అనే అమెరికన్ జర్నలిస్ట్ సిఐఏ తో అమెరికానే ఈ ధ్వంసం చేయించిందని చెప్పడం సంచలనాన్ని సృష్టించింది. పోలాండ్ నుండి ఒక ఆరుగురు టీం వెళ్లి ఈ విధ్వంసం సృష్టించారని ఆయన చెప్పారు. ఆ తర్వాత బ్రిటన్ కూడా ఒక ఆరుగురు టీం ఈ విధ్వంసం సృష్టించారని, అయితే వాళ్లు రష్యాకు శత్రువులు అని ఉక్రెయిన్ కు స్నేహితులని చెప్పిందట.

అయితే వాళ్లలో ఒకరిద్దరూ రష్యా వాళ్ళు ఉన్నారు, ఇద్దరు పోలాండ్ వాళ్ళు కూడా ఉన్నారు అని కూడా చెప్పిందట. తన సొంత దేశమైన జర్మనీలో జరిగిన ఈ విధ్వంసం వెనుక‌ అమెరికా హస్తముందని తెలిసిందట. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా రష్యా తీవ్రంగా స్పందించింది. రష్యా మాజీ అధ్యక్షుడైన మెద్వ దేవ్ దీనిపై కఠినమైన మాటలు మాట్లాడారని తెలుస్తుంది. జర్మనీకి ఆధారమైన పైప్ లైన్స్ ను ధ్వంసం చేసి మొత్తం యూరప్ దేశాలను నిరాధారం చేసింది అమెరికా.

ఇలా చేయడం ద్వారా భారత దేశాలన్నీ తనపై ఆధారపడి బ్రతుకుతాయని కావాలనే ఈ ఘాతకానికి అమెరికా పాల్పడినట్లుగా తెలుస్తుంది. పక్క దేశాలకు ఆపదని సృష్టించేది అదే, వాటిని తనపై ఆధారపడి బ్రతికేలా చేసేది అదే. అదే అమెరికా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల నష్టపోతుంది యూరప్ దేశాలైతే, లాభపడుతుంది అమెరికా అని, ఆ విషయాన్ని అన్ని దేశాలు అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: