ప్రకృతి విలయం : అంతా కోల్పోయారు.. అయినా ఆ నీచులు వదల్లేదు?
మరి ముఖ్యంగా కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో ప్రకృతి ఎలా విలయతాండవం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకృతి విలయానికి అక్కడ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. జనావాసాలు మొత్తం పూర్తిగా దెబ్బతిని ఎంతో మంది గూడును కూడా కోల్పోయారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకోవస్తుందో తెలియక ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బ్రతుకుతూ ఉన్నారు అని చెప్పాలి ఈ క్రమంలోనే వయనాడులో పరిస్థితులను చూసి చలించిపోతున్న ఎంతోమంది ప్రముఖులు.. ఇక ఆ ప్రాంతానికి సహాయ చర్యలు చేపట్టేందుకు విరాళాలు ప్రకటిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలా వయనాడ్ లో ప్రకృతి విలయం కారణంగా ప్రజలు అల్లాడిపోతుంటే. ఇంకోవైపు దొంగలు కూడా రెచ్చిపోతున్నారు.
దీంతో ఇప్పటికే ప్రకృతి విలయంతో నష్టపోయిన అక్కడి ప్రజలు ఈ దొంగల బెడదతో మరింత భయపడిపోతున్నారు. వాలంటీర్ల రూపంలో దొంగలు చెలరేగిపోతున్నారని.. విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్నారని ఎంతో మంది బాధితులు వాపోతున్నారు. చూరల్మల, ముండకై గ్రామాల్లో కొండ చర్యలు విరిగిపడటంతో ఎంతమంది చనిపోయారు ఈ క్రమంలోనే అధికారులు గ్రామస్తులను ఇల్లు ఖాళీ చేయించి.. శిబిరాలకు తరలిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొంతమంది నీచులు వాలంటీర్ల పేర్లు చెప్పి ఇక విలువైన వస్తువులను దోచుకోవడం మొదలుపెట్టారు దీంతో ఇది గమనించిన అధికారులు వాలంటీర్లకు ఐడి కార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు.