వ్యభిచార గృహానికి రక్షణ కల్పించండి.. కోర్టులో పిటిషన్ వేసిన లాయర్?

praveen
సాధారణంగా డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే డబ్బు సంపాదించడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది వ్యాపారం చేసి ఇక తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏకంగా ఉద్యోగం చేస్తూ పైసా పైసా కూడబెట్టుకుని.. డబ్బులు సంపాదించడం చూస్తూ ఉంటాం. అయితే మరి కొంత మంది మాత్రం డబ్బులు సంపాదించడం కోసం నీచమైన దారులు వెతుకుతూ ఉంటారు.

 ఈ మధ్యకాలంలో అయితే ఏకంగా అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ ఎంతోమంది డబ్బులు సంపాదించాలి అనే ఆశతో అటు వ్యభిచార గృహాలు నిర్వహిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఈ మధ్యకాలంలో ఎప్పటికప్పుడు పోలీసులు కూడా అలర్ట్ గా ఉంటూ.. వ్యభిచార గృహాలపై దాడులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇక ఇలాంటివి అసలు ఆగడం లేదు. ఏకంగా స్పా ముసుగులో ఇలాంటి వ్యభిచార గృహాలు నిర్వహిస్తూ ఉండడం ఈ మధ్య కాలంలో తరచూ వెలుగులోకి వస్తుంది. అయితే ఇలా వ్యభిచారం నిర్వహిస్తున్నారు అంటూ సమాచారం వస్తే చాలు పోలీసులు రైడింగ్స్ నిర్వహించడం చూస్తూ ఉంటామ్.

 కానీ ఇక్కడ మాత్రం ఒక సంచలన ఘటన జరిగింది. ఏకంగా వ్యభిచార గృహానికి రక్షణ కల్పించాలి అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. అయితే ఈ పిటిషన్ వేసింది ఎవరో కాదు ఏకంగా న్యాయవాదే కావడం గమనార్హం. తమిళనాడులోని కన్యాకుమారిలో తన వ్యభిచార గృహానికి రక్షణ కల్పించాలని లాయర్ మురగదాస్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో ఈ పిటిషన్ చూసి కోర్టు సైతం షాక్ అయింది. తాము పరస్పర సమ్మతితో సెక్స్ సర్వీస్ అందిస్తున్నామని ఆ లాయర్ వాదించారు. తనపై కేసు కొట్టివేయాలని.. తన వ్యాపారం జోలికి రాకుండా పోలీసులు ఆదేశించాలంటూ కోర్టును కోరారు   అయితే చట్ట విరుద్ధ వ్యాపారానికి భద్రత కోరినందుకుగాను సదరు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. పదివేల జరిమానా కూడా విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: