ట్రైన్ ఢీకొనడంతో చనిపోయిన ఏనుగు.. హార్ట్ బ్రేకింగ్ వీడియో వైరల్?

praveen
ట్రైన్లు, బస్సులు, కార్లు, లారీల వల్ల వన్యప్రాణుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ మధ్య ఒక పులి కారు ఢీకొని మరణించింది. అత్యంత బాధాకరమైన పరిస్థితులలో అది రోడ్డుపై నుంచి పొదల్లోకి వెళ్లిపోవడం కనిపించింది ఈ దృశ్యాలు ఎంతో బాధను కలిగించాయి ఇప్పుడు అంతకంటే ఎక్కువ మనోవేదన కలిగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక ఏనుగు ట్రైన్ ఢీకొట్టడం వల్ల చనిపోవడం కనిపించింది.
వివరాల్లోకి వెళ్తే, అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో ఒక పెద్ద అడవి ఏనుగు రైలు ఢీకొని మృతి చెందింది. అటవీ శాఖ అధికారుల ప్రకారం, ఈ సంఘటన బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో గౌహతి నగరానికి సమీపంలోని జగిరోడ్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతం ఏనుగుల కారిడార్ కాదని, అందువల్ల రైలు వేగానికి ఎలాంటి ఆంక్షలు లేవని నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ రైల్వే (NFR) అధికారులు తెలిపారు.
జాగ్రత్త వహించినప్పటికీ, రైలు డ్రైవర్ చివరి క్షణంలో వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడని NFR అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనను స్థానికులు గమనించారు. ఢీకొట్టిన తర్వాత ఏనుగు తీవ్రంగా గాయపడి, కొన్ని నిమిషాల తర్వాత మరణించిందని వారు తెలిపారు.
అటవీ శాఖ అధికారుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించింది. డాక్టర్లు పరీక్షించి ఏనుగు మరణానికి కారణం అంతర్గత గాయాలు, ముఖ్యంగా తలకు గాయాలు అని నిర్ధారించారు. అధికారుల అంచనా ప్రకారం, ఈ అడవి ఏనుగు తన మంద నుండి విడిపోయి ఆహారం కోసం అడవి నుండి బయటకు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.
బుధవారం ఉదయం 4:52 గంటలకు అస్సాం, మోరిగావ్ జిల్లా గౌహతి సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రైలు డ్రైవర్ ఉదయం వేళ కాబట్టి ఏనుగును సరిగ్గా చూడలేకపోయాడు. డ్రైవర్ చివరి క్షణంలో వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఏనుగు రైలు ఢీకొన్న తర్వాత కొన్ని నిమిషాలు నడవడానికి ప్రయత్నించిన తర్వాత, పట్టాల దగ్గర పడిపోయి మరణించింది. బుధవారం సాయంత్రం, అటవీ శాఖ, NFR సిబ్బంది కలిసి ఏనుగు మృతదేహాన్ని పట్టాల నుండి తొలగించి, అడవి ప్రాంతానికి సమీపంలో సమాధి చేశారు. ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకొని చాలామంది జంతు ప్రేమికులు  కన్నీరు కారుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: