ఛీ ఛీ.. పిల్లలు ఇలా తయారైతే.. రేపటి భవిష్యత్తు ఏంటో?

praveen
నేటి రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీకి అనుగుణంగా మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి పని విషయంలో కూడా టెక్నాలజీ మీద మితిమీరి ఆధారపడుతున్నాడు మనిషి. అయితే ఇలాంటి టెక్నాలజీ యుగంలో మనిషి మనిషిలా ఉండడం లేదు అన్నది మాత్రం వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనల ద్వారా అర్థమవుతుంది. మొన్నటి వరకు కేవలం అడవుల్లో ఉండే మృగాలు మాత్రమే డేంజరస్ అనేవారు. కానీ ఇప్పుడు మనిషి ప్రవర్తన తీరు చూస్తూ ఉంటే మనుషులు మృగాల కంటే మరింత ప్రమాదకరంగా మారిపోయారు అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది.

 ఎందుకంటే కామంతో కళ్ళు మూసుకుపోయి ఏకంగా తాము మనుషులం అన్న విషయాన్ని మరిచిపోతున్న ఎంతోమంది మృగాలు చివరికి దారుణంగా హత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు అత్యాచారాలు చేసి దారుణంగా హత్యలు కూడా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఆడపిల్ల ఇల్లు దాటి కాలు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే నేటి బాలలు రేపటి పౌరులు అంటూ ఉంటారు. కానీ బాలుర ప్రవర్తన తీరు చూస్తే రేపటి రోజు అనేది ఎలా ఉంటుందో అని ఊహించుకోవడానికి వెన్నులో వణుకు పుడుతుంది. అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి.

 ఇటీవల 8 ఏళ్ల బాలికపై పలువురు మైనర్ బాలురు అత్యాచారం చేసిన ఘటనలు ఎంత సంచలనగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఇలా అంటే సభ్య సమాజం తలదించుకునే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. మూడవ తరగతి చదువుతున్న బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేసి హతమార్చారు. ఈ ఘటన చూస్తుంటే సమాజంలో క్రూరత్వం ఏ స్థాయిలో పెరిగిపోతుందో అర్థమవుతుంది. సినిమాలు సోషల్ మీడియా అశ్లీల చాటింగ్ మితిమీరిన స్వేచ్ఛ గంజాయితో రేపటి పౌరుల భవిష్యత్తు నీరుగారిపోతుంది. స్కూల్ స్థాయి నుంచి మానవతా విలువలు బోధించడం వల్ల పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చని  ఎంతోమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: