పాము అకస్మాత్తుగా కనబడితే కూల్ గా ఇలా చేయండి... ఏం కాదు!
నిజానికి పాముకు చాలా భయం అన్న సంగతి మీకు తెలుసా? అయితే పాముల్లో చాలా రకాలు ఉన్నాయి. అకస్మాత్తుగా విషపూరిత పాము మీ ముందుకు వచ్చినా లేదా మిమ్మల్ని వెంటాడితే ముందు కంగారు పడకుండా శాంతంగా ఉండాలి. విషపూరితమైన పాము మీ ముంగిటకు వస్తే దాని నుంచి పారిపోకుండా ప్రశాంతంగా ఉండటమే ఉత్తమ మార్గం అంటున్నారు స్నేక్ క్యాచర్స్. ఎందుకంటే పాములు ఊరికే దాడి చేయవు కాబట్టి. పాము అకస్మాత్తుగా మీ ముందు కనబడినపుడు అక్కడినుండి పారిపోకుండా అలా నిలుచున్నచోటే ఆగిపోతే అవి వాటి మార్గం గుండా సైలెంట్ గా పోతాయి. ఎందుకంటే అవి మీరు దానిని గాయం చేయడం లేదు అనే నమ్మకంతో ఉంటాయి కాబట్టి. అలా కాకుండా మీరు కూడా ఆందోళన చెంది ఏదన్న కర్ర తీస్తే ఇక అంతే!
అదే విధంగా పాములు చాలా వరకు స్పష్టంగా చూడలేని స్థితిలో ఉండేవి చాలా ఉన్నాయి. పాము ఎదురైనప్పుడు మీరు ప్రశాంతంగా ఉండిపోతే అలాంటి పాములు ఏమీ చేయవు. మీరు పొరపాటున పాముపైకి అడుగుపెట్టినట్లయితే పాము దాడి చేస్తుందని మర్చిపోవద్దు. ఇంకా కొందరు పాములు వలయాలుగా తిరుగుతాయని, అందుకే పాములతో పరిగెత్తితే పట్టుకోలేమని కొందరు అనుకుంటారు కానీ అది చాలా తప్పు. ఈ ప్రపంచంలో 3 వేలకు పైగా జాతుల పాములు ఉన్నాయి. అందులో మనుషులను చంపగలిగే పాములు 7 శాతం మాత్రమే ఉన్నాయి. అయితే సరైన సమయంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.