పాము పగబట్టడం అంటే ఇదేనా.. వామ్మో ఎన్నిసార్లు కాటేసిందంటే?

praveen
ఈ భూమి మీద ఎన్నో రకాల జీవులు ఉంటాయి. అందులో కొన్ని మనుషులను భయపెట్టేవి ఉంటాయి. అలాంటి వాటిలో పాములు కూడా ఒకటి ఉన్న విషయం తెలిసిందే. మనిషి ఆకారంతో పోల్చి చూస్తే పాముల ఆకారం ఎంతో చిన్నది. కానీ ఆరడుగుల మనిషిని సైతం చిన్న పాము భయపెట్టగలదు. కొంతమంది పాము కనిపించినప్పుడు పైకి ఎంతో ధైర్యంగా కనిపించినప్పటికీ.. లోలోపల మాత్రం ఎంతగానో భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడైనా పాము కనిపించిందంటే.. ఇక అక్కడి నుంచి పరుగో పరుగు అంటారు. సాధ్యమైనంత వరకు విషపూరితమైన పాములకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

 అయితే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ పాములకు సంబంధించిన ఎన్నో వార్తలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా పాములు పగబడతాయా లేదా అనే విషయంపై ఇప్పటికి ఎంతోమందిలో అనుమానాలు ఉన్నాయి. అయితే పాములు పగ బడతాయి అన్న విషయాన్ని ఇప్పటివరకు ఇక కొన్ని సినిమాల ద్వారా జనాలు అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే పాములు పగబట్టవు.. వాటికి అంత తెలివి లేదు అని ఎంతో మంది నిపుణులు  చెప్పిన ఇక ఎవరు నమ్మరు. అయితే పాములు పగ బడతాయి అన్నదానికి నిదర్శనంగా అప్పుడప్పుడు ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. 35 రోజుల్లో అతన్ని పాము ఆరుసార్లు కాటు వేసింది  నాలుగు సార్లు కాటేసిన తర్వాత అతను భయపడి మరో ఊరికి వెళ్తే.. అక్కడ కూడా పాము కాటు నుంచి తప్పించుకోలేకపోయాడు. యూపీలోని ఫతేపూర్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ళ వికాస్ దుబే  వ్యక్తిని 35 రోజుల వ్యవధిలో పాము ఆరుసార్లు కాటు వేసాయి. గత నెల రెండున తొలి కాటు మొదలుకాగా.. నాలుగు సార్లు పాము కరిచాక.. భయంతో మేనత్త ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ పాము రెండుసార్లు కాటు వేసింది. అయితే పాము కాటు వేసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లడంతో బ్రతికి బట్ట కట్టాడు. అయితే కాటు వేసింది ఒకటే పామా లేకపోతే వేర్వేరు పాముల అన్న విషయం తెలియాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: