శోభనం రోజు రాత్రే.. ఉరేసుకున్న వరుడు.. ఎక్కడంటే?
ఎందుకంటే శోభనం రాత్రి రోజే చివరికి అతను ఆత్మహత్య చూసుకొని ప్రాణాలు వదిలాడు. దీంతో అక్కడ జరిగిన విషయం తెలిసి అందరూ షాక్ లో మునిగిపోయారు. ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇలా శోభనం రోజు రాత్రి నవవరుడు ఆత్మహత్యతో ఇరు కుటుంబాల్లో కూడా ఆందోళన వాతావరణం నెలకొంది. విశ్రాంత సైనికుడు అయిన గన్ సింగ్ చిన్న కుమారుడు సత్యేంద్ర వివాహానికి ముందే జూలై రెండవ తేదీన గ్రామంలో ఒక ఊరేగింపు నిర్వహించారు. రాత్రంతా బ్యాండ్ బాజా నిర్వహించారు. తర్వాత ఆచార వ్యవహారాల ప్రకారం సత్యేంద్ర వివాహం జరిగింది.
తర్వాత సాంప్రదాయం ప్రకారమే పుట్టింటి నుంచి మెట్టినింటికి కి నవ వధువును తీసుకువచ్చారు.ఇక వరుడు ఇంట్లో సాయంత్రం గ్రాండ్ గా డీజీ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలోనే సత్యేంద్ర మొదటి రాత్రికి సిద్ధమవుతున్న సమయంలో.. అటు కుటుంబ సభ్యులందరూ కూడా రెండవ అంతస్తులో ఉన్న ఒక గదిని శోభనం కోసం సిద్ధం చేశారు. అయితే పాలు గ్లాసు పట్టుకుని గది వరకు వెళ్లిన పెళ్లికూతురు ఎన్నిసార్లు తలుపు కొట్టిన సత్యేంద్ర తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా సత్యేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆమె షాకై కుటుంబ సభ్యులను పిలువగా.. తలుపులు బద్దలు కొట్టి సత్యేంద్రను ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే సత్యేంద్ర చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అన్న విషయం తెలియ రాలేదు.