రోజు అలా చేస్తున్నాడని.. భర్తకు విడాకులిచ్చిన భార్య.. అందరూ షాక్?
ఈ క్రమంలోనే కొంతమంది ఏకంగా విచిత్రమైన కారణాలతో విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్న పరిస్థితిని చూస్తే.. అందరూ నోరెళ్ళ పెడుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో యువతలో వివాహ బంధం పై ఉన్న నమ్మకం కూడా ఈ ఘటనలు చూసిన తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఒక వింతైన కారణంతో భార్య భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. ఏకంగా పచ్చళ్ళ, డబ్బాలకు మూతలు పెడుతున్నాడు అనే కారణంతో భరత్తో విడాకులు తీసుకున్నందుకు రెడీ అయింది. వినడానికే విచిత్రంగా అనిపిస్తుంది కదా.. కానీ నిజంగానే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఓ యువతి తన భర్తతో తనకున్న సమస్యల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన భర్త ఊరవేసిన ఆవకాయ పచ్చడి మూతలను ఇంట్లో గట్టిగా మూసి పెడుతున్నాడని.. వాటిని తెరవడానికి చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పుకొచ్చింది. మూత గట్టిగా ఉంటే డబ్బాలో ఉన్న ఆహారం తాజాగా ఉంటుందని ఆమె భర్త మొదట్లో చెప్పాడు. ఈ మూతలు తీయడానికి ప్రతిసారి పొరుగు వారిని అడగాల్సి వస్తుంది. ఇలా ఐదేళ్ల తరబడి మూతలు తెరవలేక అనేక అవస్థలు పడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు భర్త చేసిన పనికి విసుగు చెందిన ఆమె విడాకులకు సిద్ధమైంది. అయితే ఆ దంపతుల మధ్య ఉన్న ఒకే ఒక సమస్య ఇలా డబ్బాల మూతలు బిగుతుగా పెట్టడమేనట. ఇదే విషయంపై ఎన్నోసార్లు భార్యాభర్తల మధ్య వాదనలు కూడా జరిగాయట. దీంతో విసిగిపోయిన ఆమె భర్తతో కలిసి ఉండడానికి ఇష్టడం లేదు అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది. అయితే సదరు మహిళ ఎక్కడ ఉంటుంది అన్న విషయం మాత్రం తెలియలేదు.