రెండు సంవత్సరాలు క్రితమే ఆమె తల్లి చనిపోయింది..ఆమె తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. కూతురు బీఈడీ చదువుకుంది. ఒక్కతే కూతురు.. తనలాగే మంచి పేరు సంపాదించుకుంటుందని ఆ తండ్రి అనుకున్నాడు..కానీ.. ఆ కూతురు అడ్డదారులు తొక్కింది..ఏకంగా ఇద్దరితో ప్రేమాయణం నడిపింది.. ఈ విషయం తెలిసి తండ్రి ఆమెని మందలించాడు.. వేరే మంచి సంబంధం చూసి పెళ్లి ఆమెకి చెద్దామనుకున్నాడు.. ఈ క్రమంలోనే అది నచ్చని ఆమె పెద్ద మాస్టర్ స్కెచ్ వేసింది.. తన ప్రియుడితో కలిసి దారుణంగా కన్నతండ్రినే చంపింది.. వింటుంటేనే రక్తం మరిగిపోతుంది కదూ..! ఈ దారుణ ఘటన మన ఏపీలోనే మదనపల్లిలో చోటుచేసుకుంది.. ఇప్పుడు మదనపల్లిలో టీచర్ మర్డర్ మిస్టరీ వీడింది.. కన్న కూతురే తండ్రిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.తెలిసిన వివరాల ప్రకారం.. మదనపల్లి ఎగువ కురువ వంకలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో ప్రభుత్వ టీచర్ దొరస్వామి (62) ఫ్యామిలీ నివాసం ఉంటోంది. రెండేళ్ల క్రితం దొరస్వామి భార్య లత అనారోగ్యంతో చనిపోవడంతో ఇంట్లో తండ్రి, కూతురు మాత్రమే ఉంటున్నారు. అయితే 25 ఏళ్ల హర్షిత ఏకంగా ఇద్దరు అబ్బాయిలతో ప్రేమాయణం నడుపుతోంది. ఈ విషయం తెలిసిన దొరస్వామి.. హర్షితకు కుప్పంలో మంచి పెళ్లి సంబంధం చూశాడు. అయితే ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని హర్షిత.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే తండ్రిని హత్య చేసింది. జూన్ 13 వ తేదీన దొరస్వామి తలపై బలంగా కొట్టడంతో ఆయన పాపం చనిపోయారు.అయితే ఈ హత్య జరిగిన సమయంలో కుమార్తె ఇంట్లోనే ఉండటంతో పలు అనుమానాలనేవి వ్యక్తమయ్యాయి.. దీంతో పోలీసులు హర్షితను అదుపులోకి తీసుకుని విచారించగా అప్పుడు అసలు విషయం అనేది వెలుగులోకి వచ్చింది..
బీఈడీ చదివిన హరితకు ఇద్దరు ప్రియుళ్లు ఉన్నారు. తండ్రి లేనప్పుడు వారిద్దరితో ఇంట్లోనే శృంగారం చేస్తుంది హరిత. ఒకరోజు ఒక ప్రియుడు.. మరోరోజు ఇంకో బాయ్‌ఫ్రెండ్ హరిత ఇంటికి వస్తారు. హరిత వ్యవహారం చుట్టుపక్కల వాళ్లకి తెలిసింది. దీని గురించి తండ్రి దొరస్వామికి చెప్పారు. కుమార్తె గురించి తెలుసుకున్న దొరస్వామి చాలా బాధపడి ఆమె జీవితం చేజారిపోకూడదని భావించి.. పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. మంచి సంబంధాలు చూడటం ప్రారంభించాడు. కానీ హరిత మాత్రం తనకు పెళ్లి వద్దని చెప్పింది. ఈ విషయమై తండ్రి, కుమార్తెల మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. దాంతో ఆగ్రహించిన హరిత బాయ్‌ఫ్రెండ్స్ తో ఏకంగా తండ్రిని హత్య చేసింది.ఇక తండ్రి హత్య కోసం హరిత పక్కాగా ప్లాన్ చేసింది. ఒక ప్రియుడికి ఏకంగా రూ.10 లక్షల సుఫారీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ హత్య జరిగింది. ఐతే.. దొరస్వామిని ఎవరు చంపారన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే.. ఆమె లవర్స్‌లో ఒకడు.. హత్య జరిగినప్పుడు.. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్‌లో ఉన్నాడు. ఇక మరొక బాయ్‌ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. హరిత చపాతీలు చేసే కర్రతో, ఇనుప రాడ్డుతో తానే తండ్రిని కొట్టి చంపానని పోలీసులకు చెప్పింది. కానీ హత్య జరిగిన తీరును చూస్తే ఆమె ఒక్కతే ఈ దారుణాన్ని చేసి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అందుకు ఆమెకు కనీసం ఇద్దరు ముగ్గురు సహకరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.