సోషల్ మీడియా.. వరుడి పెళ్లిని ఆపేసింది.. ఏం జరిగిందంటే?
అయితే సోషల్ మీడియా ఇక జనాలకి కొత్త విషయాలు నేర్పించడం లో ఎప్పుడు కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. అదే సమయం లో ఇక మితి మీరిన సోషల్ మీడియా వాడకం కొన్ని కొన్ని సార్లు ఎన్నో అనర్థాలకు కారణం అవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో కాపురాల్లో సోషల్ మీడియా ఇప్పటివరకు చిచ్చు పెట్టిన ఘటనలు చాలాను వెలుగు లోకి వచ్చాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. యువతి యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. ఇక బంధుమిత్రులందరి సమక్షంలో అటు పెళ్లి వేడుక మొదలైంది. కానీ అంతలో ఊహించని ట్విస్ట్. ఒక్కసారిగా ఆ పెళ్లి ఆగి పోయింది. దీనికి కారణం సోషల్ మీడియా.
మరో మహిళతో సంబంధం ఉందని పెళ్లిరోజు వధువు బంధువులకు తెలిసింది. దీంతో ఇదే విషయం పై అటు వరుడుని నిలదీసారు వధువు బంధువులు. ఈ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలో జరిగింది. భర్తకు దూరంగా ఉంటున్న ఒక వివాహికతో వరుడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చూసిన వధువు బంధువులు వరుడిని నిలదీసారు. ఇక ఆ తర్వాత గ్రామ పెద్దలు పంచాయతీలో పెళ్లిని రద్దు చేయడంతో పాటు వరుడికి ఏడు లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు అంటూ చెబుతున్నారు పోలీసులు.