తండ్రి ఖర్చులకు డబ్బులివ్వలేదని.. కొడుకు ఏం చేశాడో తెలుసా?

praveen
నేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవన శైలిలో ఎంతలా మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన జీవనశైలని కూడా మార్చుకోవడానికి మనిషి తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉన్నాడు. అయితే అంతా బాగానే ఉన్నా ఇక టెక్నాలజీ యుగంలో బంధాలకు బంధుత్వాలకు ఉన్న విలువ మాత్రం రోజురోజుకు తగ్గిపోతుందేమో అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు ఇందుకు కారణం. మొన్నటి వరకు ఎవరు ఎటు పోయిన పర్వాలేదు కానీ నేను నా కుటుంబం బాగుంటే చాలు అని స్వార్థంగా ఆలోచించేవాడు మనిషి.

 కానీ ఇప్పుడు ఆ స్వార్థం మరింత పెరిగిపోయింది. నేను బాగుంటే చాలు నా కుటుంబం ఎటు పోయిన పరవాలేదు అన్న విధంగానే మనిషి ఆలోచన తీరు మారిపోయింది. ఎందుకంటే ఆస్తులకు అంతస్తులకు ఇస్తున్న విలువని బంధాలకు బంధుత్వాలకు ఇవ్వడం లేదు మనిషి. దీంతో ఆస్తుల కోసం ఏకంగా సొంత వారిని సైతం దారుణంగా హత మారుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇంకొంతమంది ఏకంగా చిన్న చిన్న కారణాలకే సొంత వారిని దారుణంగా హత మారుస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ఎప్పుడు ఎవరు ప్రాణాలు తీస్తారో అని ప్రతి ఒక్కరు అనుక్షణం భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది.

 ఇక్కడ ఒక కొడుకు ఏకంగా తండ్రి విషయంలో కాల యముడుగా మారిపోయాడు. ఏకంగా చిన్న కారణానికి సుపారీ ఇచ్చి మరి కన్నతండ్రిని చంపించాడు ఇక్కడ ఓ సుపుత్రుడు. యూపీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది  ప్రతాప్ ఘడ్ కు చెందిన మహమ్మద్ నసీం అనే 50 ఏళ్ల ఓ వ్యాపారవేతకు పదహారేళ్ళ కుమారుడు ఉన్నాడు. అయితే అడిగినప్పుడల్లా తండ్రి అతనికి డబ్బులు ఇవ్వడం లేదని ఏకంగా తండ్రి పైన పగ పెంచుకున్నాడు కొడుకు. ఈ క్రమంలోనే ఆయన్ని చంపేందుకు ముగ్గురు కిల్లర్లకు సుఫారీ కూడా ఇచ్చాడు. ఇక వారు నసీం ను తుపాకులతో దారుణంగా కాల్చి చంపారు. ఆ తర్వాత ముగ్గురిని నిందితులని పట్టుకుని పోలీసులు విచారించగా ఇక కొడుకే హత్య చేయించాడు అన్న విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: