ద్యావుడా.. ఇంత టాలెంటెడ్ ఉన్నారేంటి.. ఇలా కూడా డబ్బు సంపాదించొచ్చా?
కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటే ఇంకొంతమంది డబ్బులు సంపాదించేందుకు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏకంగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అతి తక్కువ సమయంలోనే ధనవంతులుగా మారడానికి కాస్త రిస్క్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక మరి కొంతమంది మాత్రం డబ్బులు సంపాదించడానికి ఏకంగా వినూత్నమైన ప్రయోగాలు చేయడం లాంటివి అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక ఇలాంటిది ఏదైనా చూసాము అంటే ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి రా బాబు అని అందరూ అవాక్కవుతూ ఉంటారు అని చెప్పాలి.
ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి భావనే కలుగుతూ ఉంటుంది. కొంతమంది డబ్బు ఎలా సంపాదించాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. కానీ ఇంకొంతమంది చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకొని.. ధనం సంపాదించే మార్గాలను వెతుక్కుంటూ ఉంటారు. ఇక్కడ ఇద్దరు యువకులు ఇదే చేశారు. వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే కొందరు బస్సులు దిగే వారిని డివైడర్ దాటిస్తున్నారు. అయితే వాళ్ళు ఏదో సహాయం చేస్తున్నారు అనుకుంటే పొరపాటే. ప్రయాణికుల దగ్గర డబ్బులు తీసుకొని మరి ఇక రోడ్డు దాటిస్తున్నారు. ఇది బంగ్లాదేశ్లో వెలుగులోకి వచ్చింది. డాకా- చిట్టి గ్యాంగ్ జాతీయ రహదారిపై చాలా ఎత్తుగా డివైడర్ ఉంది. ప్రయాణికులు డివైడర్ అవతలి ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా దూరం నడవాలి. అయితే ప్రయాణికుల అవసరాన్ని క్యాష్ చేసుకున్నారు ఇద్దరు యువకులు. డివైడర్ కు ఇరువైపుల చిన్నపాటి నిచ్చెన వేసి బస్సులో దిగే ప్రయాణికులను డివైడర్ దాటిస్తున్నారు. ఇందుకు గాను వారి దగ్గర నుంచి కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా అయితే ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజెన్స్ అందరు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.