ఈ వీడియో చూస్తే.. ఇంకోసారి మీ అమ్మాయిని ఒంటరిగా స్కూల్ కి పంపించరేమో?
అక్కడ ఇక్కడ అని తేడా లేదు ప్రతిచోట కూడా ఇలాంటి మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆడపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. మహిళలను వేధింపులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించినప్పటికీ ఎక్కడ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా ఒంటరిగా స్కూల్ కి వెళ్తున్న ఒక బాలికను వెంబడించాడు కామాంధుడు. ఆ కామాంధుడు ప్రవర్తించిన తీరు చూస్తే తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా స్కూలుకు పంపించాలంటే వణికి పోవాల్సిందే.
ఏకంగా స్కూలుకు వెళుతున్న ఒక చిన్నారిపై కామాంధుడు చిత్త కార్తీ కుక్కలాగా విరుచుకుపడ్డాడు. వీధిలో ఎవరూ లేకపోవడంతో అదే అదునుగా భావించి అత్యంత నీచంగా ప్రవర్తించాడు. బంగ్లాదేశ్ లోని దినాజ్ పూర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక యూనిఫామ్ వేసుకుని స్కూల్ బ్యాగ్ ధరించి పాఠశాలకు వెళుతుంది. అయితే వీధిలో జనాలు ఎవరూ లేరు. ఇదే అదునుగా భావించిన ఒక యువకుడు బాలికను ఫాలో అవుతూ వచ్చాడు. ఇది గమనించిన బాలిక భయంతో పక్కకు నిలబడింది. అయితే వెంటనే ఆమె పైకి దూసుకు వెళ్లిన యువకుడు బలవంతంగా బాలికకు ముద్దు పెట్టి అసభ్యంగా తాకాడు. అయితే బాలిక గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయింది. అతన్ని కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ అందరు కూడా డిమాండ్ చేస్తున్నారు.