లవర్ గుడ్డు కూర చేయలేదని.. అతను ఏం చేశాడో తెలుసా?
ఏకంగా కుటుంబ సభ్యులను రక్తం పంచుకుని పుట్టిన వారిని దారుణంగా హత మారుస్తున్న ఘటనలు అందరిని అవాక్కేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్న హత్యలకు గల కారణాల గురించి తెలిసి ఇంత చిన్న కారణానికి కూడా ప్రాణాలు తీస్తారా అని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించి చెప్పాలి. ఏకంగా తనకు ఇష్టమైన కూర చేయలేదు అన్న కారణంతో ప్రియురాలని దారుణంగా నరికి చంపాడు ప్రియుడు.
గురు గ్రామ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా గుడ్డు కూర చేయలేదని ప్రియురాలని.. ఓ వ్యక్తి హత్య చేశాడు. లలన్ యాదవ్, అంజలి జంట గురుగ్రామ్ లో సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల మద్యం మత్తులో ఇంటికి వచ్చిన లలన్ యాదవ్ ఇక ప్రియురాలు అంజలిని గుడ్డు కూర చేయు అంటూ అడిగాడు అయితే ఆమె మాత్రం పట్టించుకోలేదు దీంతో మద్యం మత్తులో లలన్ కోపంతో ఊగిపోయాడు. ఇక బెల్టు సుత్తితో ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. అయితే దెబ్బలకు తాళలేకపోయినా అంజలి చివరికి ప్రాణాలు విడిచింది. అయితే ఇక ఇలా అంజలి ప్రాణాలు కోల్పోయింది అన్న విషయాన్ని గమనించిన లాలాన్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు తెలుపగా. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న లలన్ కోసం వెతుకులాట ప్రారంభించారు.