షాకింగ్ : క్రెడిట్ కార్డు.. ఇద్దరి ప్రాణాలను తీసింది?
ఆ తర్వాత కాలంలో ఎలాగో తీసుకున్నాం కదా.. ఇప్పుడు ఖర్చు చేస్తే దాదాపు నెలన్నర తర్వాత మళ్లీ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఏదో ఒకటి చేసి డబ్బు కట్టొచ్చులే అనుకుంటూ ఇక ఇస్టారీతిన క్రెడిట్ కార్డు వాడటం చేస్తూ ఉన్నారు. కానీ ఇలా మొదట్లో కాస్త అవసరాలు తీరుస్తున్నట్లు కనిపించిన క్రెడిట్ కార్డు.. ఆ తర్వాత వ్యసనంలా మారిపోయి ఏకంగా అప్పుల ఊబిలో కూరుకు పోయేలా చేస్తూ ఉంది. ఇక ఇలా క్రెడిట్ కార్డు అనే మాయలో పడిపోయి నేటి రోజుల్లో ఎంతోమంది సంపాదించిన మొత్తాన్ని కూడా బిల్లులు కడుతూనే బ్రతికేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఏకంగా క్రెడిట్ కార్డు ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక దారుణ ఘటన జరిగింది.
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక భార్య భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్, భార్య కుమారుడు కుమార్తెతో ఉంటున్నాడు. ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డ్ ఎక్కువగా వినియోగించి మళ్లీ బిల్లులు కట్టలేకపోయాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో దంపతులు తీవ్ర మనస్థాపానికి గురి అయ్యారు. పిల్లలను బంధువుల ఇంటికి పంపించి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు దంపతులు. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.