వరుసకు అన్నచెల్లెలు.. కానీ ప్రేమలో పడ్డారు.. వాలెంటైన్స్ డే రోజు ఏం చేశారంటే?
ప్రతి మనిషి జీవితంలో అన్నాచెల్లెళ్ల బంధం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా అన్నాచెల్లెళ్ల వరుస ఇద్దరూ యువతీ యువకులు ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా. చివరికి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ వరుస కుదరదు కాబట్టి పెద్దలు ఒప్పుకోరు అనే భయం వారిలో నిండిపోయింది. అయితే ఇక విడిపోవడానికి వారి మనసు ఒప్పుకోలేదు. దీంతో వాలంటైన్స్ డే రోజునే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు అన్నచెల్లి వరసయ్యే ఈ ప్రేమికులు. ఏకంగా చావులోనైనా ఒక్కటి అవుదాం అని అనుకున్నారు. చివరికి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మహోబా జిల్లాలో జరిగింది. చర్ కరి ఏరియాకు చెందిన 22 ఏళ్ల సురేంద్ర వరుసకు చెల్లి అయ్యే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా సురేంద్రను ప్రేమించటం మొదలుపెట్టింది. నాలుగేళ్లు ప్రేమలో మునిగి తేలారు. ఇక పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఇక వరుస కుదరదు అని వారు భయపడిపోయారు. పెద్దలు వారి పెళ్లికి అంగీకరించరూ అని నిర్ణయించుకున్నారు. సురేంద్ర తన పొలంలో పురుగుల మందు సేవించి చనిపోగా.. ఇంట్లో ఉన్న అమ్మాయి కూడా పురుగుల మందు తాగింది. ఇక వీరిద్దరిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికి మరణించినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.