జైలు నుండి విడుదలైన పావురం.. ఇంతకీ ఏం చేసిందంటే?
ఈ క్రమంలోనే వారిని జైల్లో పెట్టి కేసు పై విచారణ చేస్తూ ఉంటారు. ఇక విచారణ తర్వాత ఆధారాలను సేకరించి ఇక అరెస్టు చేసిన నిందితుడిని కూడా కోర్టులో ప్రవేశపెట్టడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ ప్రాసెస్ పూర్తయినని రోజులు కూడా నేరారోపణ ఎదుర్కొంటున్న నిందితుడు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టులో నిర్దోషి అని తేలితే చివరికి అతని విడుదల చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే పోలీసులు ఇలాగే రిలీజ్ చేశారు. రిలీజ్ చేశారు అనగానే ఎవరో మనిషిని అనుకునేరు. కాదు ఏకంగా పావురం పోలీస్ కస్టడీ నుంచి విడుదలైంది.
పావురం పోలీస్ కస్టడీ నుంచి విడుదల కావడం ఏంటి.. అంటే నేరం చేసిందని ఆ పావురాన్ని అరెస్టు చేశారా ఏంటి అంటారా.. మీరు చెప్పింది నిజమే. పావురాన్ని అరెస్టు చేయగా ఇటీవలే పోలీస్ కస్టడి నుంచి పావురం విడుదలైంది. గత ఏడాది మేలో ముంబై పోస్టు వద్ద సంచరిస్తున్న పావురం రెక్కలపై చైనా భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. గూడ చర్యం చేస్తున్నట్లు అనుమానించిన పోలీసులు.. ఆ పావురాన్ని అదుపులోకి తీసుకున్నారు. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఎలాంటి కూడా గూడ చర్యానికి పాల్పడలేదని తేల్చారు. అలాగే పక్షిని అనవసరంగా బంధించారు అంటూ పెటా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ఉండడంతో చివరికి ఆ పావురాన్ని విడిచిపెట్టారు.