ఓరి నాయనో.. కళ్ళు తాగిన మత్తులో మహిళ ఏం చేసిందో తెలుసా?
ఇక ఇక్కడ హైదరాబాద్ నగరంలోని చందానగర్ లో కూడా ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కళ్ళు తాగిన మత్తులో ఒక మహిళ చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోయారు. కల్లు తాగిన మత్తులో ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్న మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంది. గోపి నగర్ కాలనీ రోడ్డు నెంబర్ త్రీ లో ఉండే షమీం బేగం అనే 58 ఏళ్ల మహిళ గత ఏడాది భర్త చనిపోవడంతో కుమార్తె సహేరా బేగంతో ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి ఆమె మానసికంగా బాధపడుతుంది.
ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ఏకంగా యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది సదరు మహిళ. అయితే ఆమెకు ప్రతిరోజు కూడా కల్లు తాగే అలవాటు ఉంది. దీంతో ఎప్పటిలాగానే ఇటీవలే కళ్ళు తాగింది. అయితే తాగిన మత్తులో షమీం బేగం రాత్రి సమయంలో ఏకంగా ఇంట్లోకి వెళ్లి డోర్ లాక్ వేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆమె కేకలు వేయడంతో కూతురు సహెరా బేగం తల్లిని కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. స్థానికులు వచ్చి సహాయం చేయడంతో ఇక తీవ్ర గాయాల పాలైన షమీం బేగం ని ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.