ఫోటోషూట్ వద్దన్న పేరెంట్స్.. కూతురు చేసిన పనికి అందరూ షాక్?

praveen
నేటి ఆధునిక సమాజంలో మనిషి జీవన శైలిలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఒకప్పటిలా మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడకుండా ఇక తమకు నచ్చినట్టుగా బ్రతికేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక సరికొత్త టెక్నాలజీతో ఎన్నో వినూత్నమైన ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్న నేపద్యంలో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి పనిని కూడా ఎంతో సులభతరం చేసుకుంటున్నారు. ఇక నేటి రోజుల్లో అక్షరాస్యత కూడా పెరిగిపోతుంది. ఇలా ఆధునిక సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా మనిషి నాగరికతలో అడుగు పెట్టాడు అన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం అందరిని ఆందోళన కలిగిస్తుంది. ఈ నేటి ఆధునిక సమాజంలో మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడెమో అని భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది.

 ఎందుకంటే ఒకప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ధైర్యంగా నిలబడి ఎదుర్కునే వాడు మనిషి. కానీ ఇప్పుడు చిన్న సమస్యకే కృంగిపోయి ఏకంగా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నేటి రోజుల్లో ఇలా వెలుకులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత ఇంత చిన్న కారణానికి కూడా ఆత్మహత్య చేసుకొని నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటారా అని ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.

 ఏకంగా పేరెంట్స్ ఫోటోషూట్ వద్దన్నారు అనే కారణంతో ఒక యువతి కఠిన నిర్ణయం తీసుకుంది. బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన బెంగళూరులోని సుధామ నగర్ లో వెలుగు చూసింది. వర్షిని అనే 21 ఏళ్ళ యువతి ఫోటోగ్రఫీ కోర్స్ చేసింది. ప్రస్తుతం బీబీఏ చదువుతున్న ఆమె న్యూ ఇయర్ సందర్భంగా ఒక మాల్ లో ఫోటోషూట్ చేయించుకోవాలని అనుకుంది. కానీ అందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో మనస్థాపం చెందిన యువతి ఇంట్లో గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: