భార్యను రూ.20 వేలు పెట్టి ఫోన్ కొనిచ్చాడు.. కానీ చివరికి?
ఎక్కడో దూరప్రాంతాల్లో ఉండడంతో స్మార్ట్ ఫోన్ కొనిస్తే భార్యా పిల్లలతో ప్రతిరోజు వీడియో కాల్ మాట్లాడవచ్చు అని ఆశపడ్డాడు. ఇక ప్రతిరోజు ఇలా వీడియో కాల్స్ మాట్లాడుతున్న భార్య.. భార్య నుంచి ఓ రోజు ఎలాంటి స్పందన లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. అనుమానం వచ్చి పక్కింట్లోకి ఫోన్ చేశాడు భర్త. చివరికి వాళ్ళు చెప్పిన మాట విని ఒక్కసారిగా ఆ భర్త గుండె బద్దలైంది. బీహార్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భర్త జీవనోపాధి కోసం నేపాల్ వెళ్ళాడు. అక్కడే కూలి పనులు చేస్తూ డబ్బులు ఇంటికి పంపించేవాడు.
ఇక ఇటీవలే భార్య పిల్లలను చూసేందుకు ఇంటికి వచ్చాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే భార్యకి 20వేల రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. కొన్నాళ్లపాటు అదే ఫోన్లో భార్యా పిల్లలతో వీడియో కాల్స్ మాట్లాడేవాడు. కానీ ఓ రోజు భార్య ఫోన్ స్విచ్ ఆఫ్ రాగా.. పక్కింటి వాళ్లకు ఫోన్ చేశాడు. అయితే మీ భార్య తన ప్రియుడితో కలిసి పారిపోయింది అని పక్కింటి వాళ్ళు చెప్పిన వార్తతో భర్త గుండె బద్దలైంది. వెంటనే పోలీసులు ఆశ్రయించాడు. పిల్లలు రెండు నుంచి ఆరేళ్ల వయస్సు వారే కావడంతో ఇక తల్లిలేని వారి బాధ్యతలను అతనే చూసుకుంటున్నాడు.