చదువు కోసం హైదరాబాద్ వెళ్ళిన యువతి ప్రియుడితో సహజీవనం చేసింది... తరువాత జరిగింది ఇదే!
నేటి యువత గురించి ఇక్కడ పెద్దగా చర్చించడం అనవసరం. ఈ విషయాలు తెలియక ఎందరో మహానుభావులు భారతదేశానికి యువత వెన్నెముకవంటివారు అని కీర్తించారు. కానీ నేటి తరం వింతపోకడ, పాశ్చాత్య మాయలో పడి కొట్టుకుంటున్నారు. వ్యక్తిగత బాధ్యతలను కూడా విస్మరించి పెడతోవలు పడుతున్నారు. తల్లిదండ్రులు కులీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో వారి కన్నవారిని వారిలా కాకుండా ప్రయోజకుల్ని చేయాలని శ్రమిస్తున్న వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. ఇలాంటి వ్యధలెన్నో మనచుట్టూ నడుస్తున్నాయి.
తాజాగా అటువంటి మరో సంఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం బల్కంపేటలో నివసిస్తున్న ఓ జంటకి 26 ఏళ్ల వయస్సుగల యువతి వుంది. ఆమె ఓ కంప్యూటర్ కోర్సు చదవాలని అంటే ఆమె తల్లిదండ్రులు ఎస్‌ఆర్ నగర్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో చేర్పించారు. కోర్సుకి అవసరమైన డబ్బులు వారి వద్ద లేకపోయినా కుమార్తె ఉన్నతికోసం అప్పు చేసి మరీ డబ్బులు సర్దుబాటు చేశారు. ఇంకేముంది, ఆమె హాయిగా ఆ కోచింగ్ సెంటర్ లో తనకు నచ్చిన కంప్యూటర్ కోర్సుని చదువుతోంది. ఈ క్రమంలో ఆ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న యజమాని, గుంటూరు జిల్లా వాసి, చినబాబు (31 ఏళ్ళు)తో ఆమెకి పరిచయం ఏర్పడింది. అక్కడే వచ్చింది అసలు చిక్కు.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వారిద్దరూ చాన్నాళ్లపాటు ఒకే రూములో సహజీవనం కొనసాగించారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. దాంతో చినబాబుని పెళ్లి చేసుకోమని అడగగా ఆతగాడు చేసుకుంటానని, కాస్త సమయం ఇవ్వమని, ముందుగా అబార్షన్ చేయించుకోవాలని ఆమెని సూచించాదట. ఆ మాటలు నమ్మిన ఆ యువతి హాస్పిటల్ కి వెళ్ళి అబార్షన్ చేయించుకుంది. ఆ తరువాత చినబాబు మాట మార్చి పెళ్ళికి ససేమిరా అనడంతో ఆమె లబోదిబోమని తన గొడుని కన్నవాళ్ల ముందు ఉంచింది. దాంతో వారు కన్నీరు మున్నీరు అయ్యారు. చదువుకోమని చెబితే ఇలాంటి ఎంత పని చేశావమ్మా అంటూ వాపోయారు. ఆ తరువాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రస్తుతం అతనిని విచ్చరిస్తున్నారు.