యోగి అడ్డాలో.. ఇంతటి దారుణమా?
ఇలా నేరస్తులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న యోగి అడ్డాలో.. ఇటీవల ఒక దారుణమైన ఘటన జరిగింది. ఏకంగా రెచ్చి పోయిన కామందులు ఒంటరిగా ఉన్న బాలికపై దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. జౌను పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల దళిత అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిన కామందులు.. సామూహిక అత్యాచారం చేశారు. మచిలీషాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అమ్మాయి ఇక తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటుంది.
ఈ క్రమంలోనే ఇది గమనించిన కొంతమంది కామాంధులు ఇంట్లోకి చొరబడి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లి నిర్మానుష ప్రదేశంలోకి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే టార్చర్ తట్టుకోలేక బాలిక కేకలు వేసింది. దీంతో సమీపంలో ఉన్న గ్రామస్తులు వస్తారని భయపడిన నిందితులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు అని చెప్పాలి. అయితే ఇంత దారుణమైన ఘటన జరిగినా ఉత్తర ప్రదేశ్ లో ఈ విషయం గురించి ఎక్కడ తెరమీదకి రాకపోవడం గమనార్హం. తక్కువ కులం కావడం.. సహాయం చేసే వాళ్ళు లేకపోవడం.. ఇక రాజకీయ పలుకుబడి లేకపోవడంతో.. అమ్మాయి కుటుంబ సభ్యులు ఏమి చేయలేక ఎవరిని ఆశ్రయించలేకపోయారు అని చెప్పాలి. ఇక ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.