చితక్కొట్టిన భార్య.. ఈ కొట్టుడు ముందు WWE కూడా పనిచేయదు?

praveen
సంసారం ఒక చదరంగం అన్నాడు ఒక కవి. సంసార సాగరంలో మునిగితేలుతున్న ప్రతి ఒక్కరు ఇది నిజమే అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే కలలో కూడా ఊహించని రీతిలో కష్టాల కడలిలో జీవితాన్ని ముందుకు నడిపించాల్సి ఉంటుంది. కష్టాలే కాదు ఇక మాటల్లో వర్ణించలేని సంతోషాలు కూడా సంసార జీవితంలో ఉంటాయి. అయితే పెళ్లి చేసుకొని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత.. భార్య భర్తలు ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటారు. ఎంత అన్యోన్యంగా ఉన్న భార్య భర్తల బంధం లో గొడవలు అనేవి సహజం.


 అప్పుడప్పుడు గొడవలు పడటం వల్లే ఇక ఆ బంధం మరింత బలపడుతుందని కూడా అందరూ చెబుతూ ఉంటారు. అయితే ఇలా ఒకవేళ గొడవ జరిగిన సమయంలో ఆ గొడవను బయట పడకుండా  నాలుగు గోడల మధ్య  ఉంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి పెద్ద సమస్య అయితే ఇంట్లో వాళ్ళని పిలిచి ఇక వాళ్లతో మాట్లాడించి సమస్య సర్దుమనిగేలా చూసుకుంటారు. అయితే ఇంకా పెద్దగా గొడవ మారితే పంచాయతీ పెట్టుకోవడం కూడా చూస్తూ ఉంటాం. కానీ భార్యాభర్తలు ఏకంగా పబ్లిక్ ప్లేస్ లలో గొడవపడి ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం మాత్రం తక్కువగా చూస్తూ ఉంటాము. ఒకవేళ ఇలా గొడవపడిన భర్త భార్యను కొడుతూ తిడుతూ కనిపిస్తాడు. కానీ భార్య భర్త పైకి చేయి కూడా ఎత్తదు.


 కానీ ఇక్కడ జరిగిన ఘటన మాత్రం పూర్తిగా రివర్స్ గా మారింది. భర్త భార్యను కొట్టడం కాదు భార్య భర్తను చితక్కొట్టింది. ఎంతలా అంటారు ఏకంగా డబ్ల్యుడబ్ల్యుఈ లెవెల్ లో దంచి కొట్టింది భార్య. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే భార్యాభర్తలు ఇలా గొడవ పడుతున్న సమయంలో పక్కనే ఉన్న యువకులు ఏది చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఇక వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. భార్యాభర్తలు రైల్వే స్టేషన్లో నిలబడి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో భర్త ఆమెను తిడతాడు. దీంతో ఆమెకు ఒక్కసారిగా కోపం వచ్చి భర్త చంప మీద కొడుతుంది. అంతటితో ఆగకుండా అతను తేరుకునే లోపే డబ్ల్యుడబ్ల్యుఈ లో లాగా అతని కాళ్లు లాగి కిందపడేస్తుంది. తర్వాత అతని పైనకి ఎక్కి లేవకుండా కొడుతూనే  ఉంది. భర్త తేరుకునేందుకు ప్రయత్నించిన.. అవకాశం ఇవ్వకుండా దారుణంగా కొడుతుంది మహిళ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: