అమ్మాయి లవ్ ఒప్పుకోలేదని.. అతను ఏం చేసాడో తెలుసా?

praveen
ప్రేమ అనేది ఎన్నో మధురానుభూతులకు కేరాఫ్ అడ్రస్. ఒకసారి ప్రేమలో పడిన తర్వాత ఈ ప్రపంచాన్ని సైతం మరిచిపోయి ప్రేమికులు ప్రేమ అనే సాగరంలో మునిగితేలుతూ ఉంటారు. ఇది ఎవరో చెప్పడం కాదు.. అక్కడక్కడ లవర్స్ ని చూస్తే అర్థమవుతుంది. ఇక ప్రేమలో పడినవారు కూడా ఇదే విషయం చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తే మాత్రం ప్రేమించడమే పాపమా అని భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే ప్రేమ కారణంగా పోతున్న ప్రాణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి.

 ఏకంగా మంచి వాళ్ళ ముసుగులో ప్రేమ అంటూ వెంటపడిన వారు చివరికి అవసరాలు తీర్చుకొని మోసం చేస్తున్నారు  దీంతో ప్రేమించిన వారు మోసం చేశారు అని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఇక తమ ప్రేమను అమ్మాయి లేదా అబ్బాయి ఒప్పుకోలేదు అన్న కారణంతో చివరికి అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి తరహా ఘటనలు ప్రేమ అనే రెండు అక్షరాల మీద ఉన్న ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని కూడా మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఇక్కడ ప్రేమ కారణంగా మరో ప్రాణం గాల్లో కలిసిపోయింది. హైదరాబాద్ నగరంలోని బోరబండ పరిధిలో ఒక యువకుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. బోరబండ ప్రాంతంలో నివాసం ఉంటే భాగ్యలక్ష్మి అనే మహిళ కుమారుడు 20 ఏళ్ల సాయి మణికంఠ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నాడు  అయితే ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయిని మణికంఠ ప్రేమించి ఆమెతో ఎంతో స్నేహంగా ఉండేవాడు. అయితే ఇటీవలే తన మనసులో ఉన్న ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పాడు. కానీ ఆమె మాత్రం అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన మణికంఠ  ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: