ఎంతటి దారుణం.. చంటి బిడ్డతో రైలులో వెళ్తున్న తల్లిపై యువకుడు అత్యాచారం?

praveen
ఈ రోజుల్లో కామాంధుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ఈ నీచులు చిన్నా, పెద్దా, ముసలి ముతక అనేది చూడకుండా తమ పశువాంఛను తీర్చుకునేందుకు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక దుర్మార్గుడు కదులుతున్న రైలులో చంటి బిడ్డతో కలిసి ప్రయాణిస్తున్న ఒక తల్లిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేశాడు. ఆ రైలులో మరొక యువకుడు కూడా ఉన్నాడు. అతడు ఈ దారుణాన్ని ఆపడానికి బదులుగా కామాంధుడికి హెల్ప్ చేశాడు. ఆ పసి బిడ్డను రైలులో నుంచి పారేస్తామని బెదిరిస్తూ మహిళపై ఈ నీచానికి వారు పాల్పడ్డారు. ఈ షాకింగ్ ఘటన అసోం రాష్ట్రంలో గౌహతి-అలీపుర్ద్దార్ వెళ్లే సిఫాంగ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో శనివారం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ప్రాంతంలో బాధిత మహిళ బిడ్డతో కలిసి గౌహతిలో సిఫాంగ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కింది. ట్రైన్ కదిలి ఫకీరాగ్రామ్ ప్రాంతానికి వచ్చేసరికి ఆమె బోగీలో ఉన్న తోటి ప్రయాణికులందరూ వారి వారి స్టేషన్లలో దిగిపోయారు. చివరికి బోగీలో బాధిత మహిళతోపాటు ఇద్దరు యువకులు మిగిలారు. అదే అదునుగా భావించిన ఆ నీచులు తల్లిపై అఘాయిత్యం చేయాలని అనుకున్నారు. మొదటగా ఒక యువకుడు చంటి బిడ్డను లాక్కొని ట్రైన్ లో నుంచి బయట పడేస్తానని బెదిరించాడు. ఇంకొక యువకుడు ఆమెను రేప్ చేశాడు. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది దరిదాపుల్లో కూడా లేకపోవడంతో వీరు మరింత రెచ్చిపోయారు.
మొదటగా ఆ మహిళ వారిని ప్రతిఘటించింది. దాంతో సదరు యువకులు మహిళలు ఇష్టం వచ్చినట్లు కొట్టారు. తర్వాత కట్టేశారు. అనంతరం ఒక యువకుడు ఆమెపై తన పశువాంఛను తీర్చుకున్నాడు. అలీపుర్‌ద్దార్ జంక్షన్కు రాగానే బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దుర్మార్గపు పనిని చేసిన నిందితులను కోక్రాఝర్‌గఢ్కు చెందిన అబ్దు (25), మొయినుల్ హక్ (26)గా పోలీసు అధికారులు గుర్తించారు. శనివారం ఘటన జరగగా అదే రోజు రాత్రి వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆపై కోర్టులో హాజరు పరిచారు. ఇలాంటి మృగాళ్లకు కఠినమైన శిక్ష విధించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: